- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఫలించిన సెంటిమెంట్.. కట్టిన ముడుపు విప్పండి
దిశ, ఏర్గట్ల : గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అవ్వాలని అభిమానంతో చెట్టుకు కట్టిన ముడుపుని విప్పడానికి తమ ఏర్గట్ల గ్రామానికి రావాలని మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా శివన్నోళ్ల శివకుమార్ మాట్లాడుతూ..గత ఎన్నికలకు ముందు ఏర్గట్ల గ్రామానికి వచ్చిన సీఎం అభ్యర్థులు సెంటిమెంటుతో హాత్ సే హాత్ జోడో పాదయాత్రలో మండల కేంద్రానికి వచ్చిన రేవంత్ రెడ్డి సమక్షంలో చెట్టుకు ముడుపుని కట్టామన్నారు. కట్టిన ముడుపుని విప్పడానికి తమ గ్రామానికి రావాలని కోరగా..స్పందించిన సీఎం తప్పకుండా వస్తానని హామీ ఇచ్చారన్నారు. ఈ విషయమై పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు సునీల్ రెడ్డి సీఎంతో వివరించారన్నారు. స్పందించిన సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివన్నోళ్ల శివకుమార్, మండల యూత్ కాంగ్రెస్ నాయకుడు మునిమాణిక్యం అజయ్ బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముత్యాల సునీల్ రెడ్డి పాల్గొన్నారు.