- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బిల్డింగ్ పై నుంచి కిందపడి వ్యక్తి దుర్మరణం
దిశ,ఉప్పల్ : బిల్డింగ్ పై నుంచి కిందపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ కోటేశ్వర్ రావు తెలిపిన వివరాల ప్రకారం ఉప్పల్ శాంతినగర్ మాతృప్రియా హాస్పిటల్ దగ్గర బింగి బాబ్జి అలియాస్ కార్తీక్ గౌడ్ (45) ఒక అపార్ట్మెంట్ మూడో ప్లోర్ లో ఉంటున్నాడు. ఇతనికి స్వప్న అనే అమ్మాయితో 11 సంవత్సరాల క్రితం వివాహం అయింది.
వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు 5వ తరగతి, చిన్న కుమారుడు మూడో తరగతి చదువుతున్నారు. మృతుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. శుక్రవారం ఉదయం 6.30 గంటలకు తాను ఉండే అపార్ట్మెంట్ లో నాలుగో ఫ్లోర్ లో ఉన్న టెర్రస్ మీదకు వెళ్లి వాకింగ్ చేస్తుండగా హైబీపీతో కళ్లు తిరిగి టెర్రస్ మీద నుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య స్వప్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.