రౌడీ షీటర్ పేరల్లి ప్రవీణ్ అరెస్ట్

by Sridhar Babu |
రౌడీ షీటర్ పేరల్లి ప్రవీణ్ అరెస్ట్
X

దిశ, ఖమ్మం సిటీ : చట్టవిరుద్ధమైన కార్యకలాపాలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న రౌడీ షీటర్ పేరల్లి ప్రవీణ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఖమ్మం టూ టౌన్ ఇన్స్‌పెక్టర్ బాలకృష్ణ తెలిపారు. 2024 డిసెంబర్ 14న నగరంలోని ఇందిరానగర్ ప్రాంతంలో రోడ్డును అక్రమించి వేసిన రేకుల షెడ్ ను విధినిర్వహణలో భాగంగా జేసీబీతో తొలగించి వెళ్తున్న మున్సిపల్ సిబ్బంది పై ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద అడ్డుకొని జేసీబీ అద్దాలను ధ్వంసం చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయగా నిందితుడు అప్పటి నుండి పరారీలో ఉన్నాడు.

అయినా భూకబ్జాలు చేస్తూ బెదిరింపులు పాల్పడుతూ డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. దాంతో పోలీసులు పట్టుకొని అరెస్ట్​ చేశారు. నిందితుడు గతంలో ఓ హత్య కేసుతో పాటు దోపిడీ, దౌర్జన్యలు, హత్యాయత్నం వంటి మూడు కేసుల్లో నేరాలు రుజువు కావడంతో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తూ సత్ప్రవర్తనతో విడుదలయ్యాడు. గతంలో ఇతనిపై ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో సుమారు 30 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఇతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed