Hydra: అక్రమ నిర్మాణాలపై హైడ్రా పంజా.. మాదాపూర్‌లో కూల్చివేతలు

by Ramesh Goud |
Hydra: అక్రమ నిర్మాణాలపై హైడ్రా పంజా.. మాదాపూర్‌లో కూల్చివేతలు
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్(Hyderabad) చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో అక్రమ కట్టడాలపై హైడ్రా(Hydra) పంజా విసురుతోంది. అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలపై ఉక్కుపాదం మోపుతోంది. ఈ నేపథ్యంలోనే శేరిలింగంపల్లి(Sherilingam Pally) మండలం ఖానమెట్ విలేజ్, మాదాపూర్(Madhapur) అయ్యప్ప సొసైటీలోని(Ayyappa Society) 100 ఫీట్ల రహదారికి అనుకుని వున్న ఐదు అంతస్తుల భవనానికి ఎటువంటి అనుమతులు లేవని గుర్తించి, కూల్చివేతకు సిద్దమైంది. దీంతో బాహుబలి క్రెన్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీ లోని ఈ అక్రమ భవనం వద్దకు చేరుకున్నది. కూల్చివేతల నేపథ్యంలో ఎటువంటి ఘటనలు జరగకుండా భవనం వద్ద పోలీసులు, హైడ్రా డీఆర్ఎఫ్ బృందాలు బందోబస్తు చేపట్టాయి. పోలీసుల భద్రత మధ్య హైడ్రా అధికారులు కూల్చివేతలు మొదలు పెట్టారు. దీంతో ఎలాంటి ఘటనలు జరగకుండా హైడ్రా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. అలాగే భవనం మెయిన్ రోడ్ పక్కనే ఉండడంతో పవర్ సప్లై నిలిపివేశారు. అంతేగాక ట్రాఫిక్ ఇబ్బందులు కూడా లేకుండా చర్యలు చేపట్టి, కూల్చివేతలు జరుపుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed