HMPV Virus: చైనాలో విజృంభిస్తోన్న కొత్త వైరస్.. అప్రమత్తమైన భారత్

by Gantepaka Srikanth |
HMPV Virus: చైనాలో విజృంభిస్తోన్న కొత్త వైరస్.. అప్రమత్తమైన భారత్
X

దిశ, వెబ్‌డెస్క్: చైనా(China) ప్రజలను కంటిమీద కునుకులేకుండా చేస్తున్న HMPV వైరస్‌ వ్యాప్తిపై భారత్ అప్రమత్తమైంది. HMPV వైరస్‌ వ్యాప్తిపై ఆందోళన అవసరం లేదని ఇండియన్ హెల్త్ ఏజెన్సీ దేశ ప్రజలకు సూచించింది. ప్రస్తుతం మన దేశంలో అలాంటి కేసులేం నమోదు కాలేదని స్పష్టం చేసింది. వైరస్ వ్యాప్తిపై దృష్టి పెట్టాలని NCDCకి ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. వైరస్ వ్యాప్తిపై అంతర్జాతీయ ఏజెన్సీలతో భారత ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది. కాగా, HMPV అనేది RNA వైరస్. ఇది న్యుమోవిరిడే, మెటాప్న్యూమోవైరస్ జాతికి చెందినదని నిపుణులు చెబుతున్నారు.

ఈ వైరస్‌ బారినపడి చైనా ప్రజలు పెద్ద సంఖ్యలో ఆస్పత్రుల్లో చేరుతున్నట్లు అక్కడి మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. హెచ్‌ఎంపీవీతోపాటు ఇన్‌ఫ్లూయెంజా ఏ, మైకోప్లాస్మా, నిమోనియా, కొవిడ్-19 వైరస్‌లు కూడా వ్యాప్తి చెందుతున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎమర్జెన్సీ కూడా ప్రకటించినట్లు సమాచారం. ఈ వైరస్ ప్రధాన లక్షణం.. శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరికీ వ్యాపిస్తోంది.

Advertisement

Next Story