- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Breaking News : ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు బీజేపీ నేతలు మృతి
దిశ, వెబ్ డెస్క్ : ఒడిశాలో జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident)లో ఇద్దరు బీజేపీ నేతలు మృతి చెందారు. అయితే ఇది ఉద్దేశ పూర్వకంగానే జరిగినట్టి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఒడిశాలో(Odisha)ని సంబల్‌పూర్(Sambalpur) జిల్లాలో కొందరు బీజేపీ నేతలు ఆదివారం తెల్లవారుజామున కారులో భువనేశ్వర్ నుంచి కర్డోలాకు తిరిగి వెళ్తుండగా వారి కారును డంపర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బీజేపీ గోశాల మండల అధ్యక్షుడు దేబేంద్ర నాయక్, మాజీ సర్పంచ్ మురళీధర్ చురియా ఈ ప్రమాదంలో మరణించారు. డ్రైవర్‌తోపాటు మరో ముగ్గురు బీజేపీ నేతలు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, డంపర్ డ్రైవర్ తమ కారును మూడు సార్లు ఢీకొట్టినట్లు గాయపడిన బీజేపీ నేత సురేష్ చందా ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రమాదం కలిగించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో డంపర్ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.