సావిత్రీ బాయి లాంటి ఉపాధ్యాయురాళ్లను రోడ్డును వేశారు

by Naveena |
సావిత్రీ బాయి లాంటి ఉపాధ్యాయురాళ్లను రోడ్డును వేశారు
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: దేశంలోనే మొట్ట మొదటి మహిళ టీచర్ సావిత్రీబాయి ఫూలే అని,అలాంటి టీచర్ల సమస్యల సాధనకై రోడ్డెక్కి నేటికీ 26 రోజులు అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని చైతన్య మహిళ సంఘం రాష్ట్ర కో-కన్వీనర్ శ్రీదేవి,జిల్లా అధ్యక్షురాలు రాజేశ్వరీ అన్నారు. తమ డిమాండ్ల సాధనకై సర్వ శిక్ష అభియాన్ ఉపాధ్యాయులు చేస్తున్న సమ్మె శిభిరంలో వారు సావిత్రీబాయి ఫూలే జయంతీ సందర్భంగా..ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి సమ్మెకు మద్ధతు తెలిపి ప్రసంగించారు. ఎన్నికల సమయంలో వారి సమస్యలపై ఇచ్చిన హామీలను అమలు చేయాలని,సమాజంలో మార్పుకు నాందీ పలికే ఉపాధ్యాయులు ఇన్ని రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోపోవడం శోచనీయమని వారు విమర్శించారు. వెంటనే సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చొరవ చూపాలని వారు డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed