Chinmoy Das: చిన్మోయ్ కృష్ణ దాస్‌ కేసు పారదర్శకంగా విచారించండి.. బంగ్లాదేశ్‌కు భారత్ విజ్ఞప్తి

by vinod kumar |
Chinmoy Das: చిన్మోయ్ కృష్ణ దాస్‌ కేసు పారదర్శకంగా విచారించండి.. బంగ్లాదేశ్‌కు భారత్ విజ్ఞప్తి
X

దిశ, నేషనల్ బ్యూరో: జైలులో ఉన్న హిందూ సన్యాసి చిన్మోయ్ కృష్ణ దాస్‌ (chinmoy krishna das) పై దాఖలైన కేసును పారదర్శకంగా విచారించాలని బంగ్లాదేశ్‌ (Bangladesh)కు భారత్ విజ్ఞప్తి చేసింది. ఈ విషయంలో న్యాయమైన విచారణ కోరుకుంటున్నట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్(Ranadeer Jaiswal) శుక్రవారం తెలిపారు. తన వారపు మీడియా సమావేశంలో భాగంగా ఆయన బంగ్లాదేశ్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. దేశ ద్రోహానికి సంబంధించిన కేసులో చిన్మోయ్ కృష్ణదాస్ కు బెయిల్ నిరాకరించి తర్వాత జైస్వాల్ ప్రకటన చేయడం గమనార్హం. కాగా, షేక్ హసీనా ప్రభుత్వం పతానానంతరం బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు జరగగా వాటికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలకు చిన్మోయ్ కృష్ణ దాస్ నాయకత్వం వహించారు. ఈ క్రమంలోనే గతేడాది నవంబర్ 25న ఆయనను అరెస్ట్ చేశారు. ఆయన బంగ్లాదేశ్ జెండాను అగౌరవపర్చాడని, దేశ ద్రోహానికి పాల్పడ్డారని ఆరోపణలు మోపారు. పలుమార్లు ఆయనకు అక్కడి కోర్టు బెయిల్ నిరాకరించింది.

Advertisement

Next Story