- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kishan Reddy: రేవంత్ రెడ్డి నీ సవాల్ కు నేను రెడీ.. పేదల కోసం మూసీ దగ్గర ఉండేందుకు సిద్ధం-కిషన్‌రెడ్డి
దిశ, డైనమిక్ బ్యూరో: మూసీ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న వారు అదే మూసీ పరివాహక ప్రాంతంలో మూడు నెలల పాటు నివాసం ఉండాలని అలా చేస్తే ఆ ప్రాజెక్టును విరమించుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సవాల్ ను స్వీకరించేందుకు తాను సిద్ధమే అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. పేదల ఇండ్లను కూల్చుతామని ఒప్పుకునేది లేదన్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో పేదల ఇండ్లు కూల్చివేతలకు వ్యతిరేకంగా బీజేపీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన మహాధర్నాలో మాట్లాడిన కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరినట్లుగా అక్కడ ఉండేందుకు సిద్ధమే కానీ పేదల ప్రజల ఇండ్లు కూల్చుతామంటే చంచల్ గూడా, చర్లపల్లి జైలుకైనా వెళ్లేందుకు రెడీ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 10 నెలలు పూర్తి కావస్తోంది. నిరుపేదలకు ఇచ్చేందుకు ఏ ఇంటికి రేవంత్ ప్రభుత్వం శంకుస్థాపన కానీ, భూమి పూజ కానీ చేయలేదు. కానీ ఏండ్లుగా నివసిస్తున్న నిరుపేదల ఇండ్లను కూల్చే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలను గారడీలుగా మార్చి మసి పూసి మారేడుకాయ చేశారు.. ప్రజలను సోనియా, రాహుల్, రేవంత్ మభ్యపెట్టారని ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మూసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రజల ఇండ్లకు మార్కింగ్ వేసి ప్రజలను భయపెట్టారు. కేసీఆర్ దారిలోనే ఇప్పుడు రేవంత్ వెళ్తున్నారు. మూసీ సుందరీకరణకు మేము వ్యతిరేకం కాదు. కానీ పేదల ఇండ్లను కూలిస్తే మాత్రం ఊరుకోబోమని హెచ్చరించారు. మూసీకి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించి సుందరీకరణ చేసుకోవాలన్నారు.
మూసీ బాధితులు ఎవరైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ కు మూసీ పక్కన ఉండలేకపోతున్నామని చెప్పారా.. మా ఇండ్లు కూల్చామన్నారా? సీఎంకు ఏదో కలపడినట్లుందన్నారు. మూసీ బాధితులకు అండగా బీజేపీ ఉంటుందని వారికోసం అవసరమైతే చంచల్ గూడ జైలుకు అయినా, చర్లపల్లి జైలుకు అయినా వెళ్లేందుకు మేము సిద్ధంగా ఉన్నామన్నారు. రేవంత్ పోలీసులతో వస్తాడా? ఎలా వస్తాడో కానీ బస్తీల్లోకి రావాలని చాలెంజ్ చేశారు. ఆయన్ను ప్రజలు ఏమనకుండా మేము రక్షణగా ఉంటాం.. సెక్యూరిటీ విషయంలో ఆయనకు చింత అక్కర్లేదన్నారు. డ్రైనేజీ సిస్టం లేకుండా మూసీ సుందరీకరణ ఎలా సాధ్యం అని ప్రశ్నించారు. ఈ ముఖ్యమంత్రికి పేదలకు కనీస సౌకర్యాలు అందించడం ముఖ్యమా.. మూసీ సుందరీకరణ అవసరమో తేల్చుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దిశ, దశ లేదని ఈప్రాజెక్టుకు ఎలా ఆర్థిక వనరులు సమకూర్చుకుంటారో కూడా తెలియడం లేదన్నారు. ఒక బస్తీలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాష్టికానికి ఒక వ్యక్తి గుండెపోటుతో చనిపోయారని తెలిసింది. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ఆవేదన చెందవద్దని మీకు అండగా బీజేపీ ఉంటుందని భరోసా ఇచ్చారు.