- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మిస్సయిన 100 పాస్ బుక్కులు ఎక్కడ ?
దిశ, వైరా : దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగిన చందాగా ఉంది తపాలా శాఖలోని ఉన్నతాధికారుల వ్యవహారం. వైరా మండలంలోని గొల్లపూడి బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ లో సంవత్సర కాలంగా ఓ ప్రైవేట్ వ్యక్తి విధులు నిర్వహిస్తున్నా కనీసం అధికారులు పట్టించుకోలేదు. అయితే ప్రస్తుతం ఆ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ లో ప్రైవేటు వ్యక్తి చిన్న మొత్తాల పొదుపు నగదు లక్షలాది రూపాయలు కాజేసిన వ్యవహారం బహిర్గతం కావడంతో ప్రస్తుతం అధికారులు ఆపసోపాలు పడుతున్నారు. ఈ వ్యవహారం బహిర్గతమై వారం రోజులు గడుస్తున్నా నేటి వరకు అధికారికంగా శాఖ పరమైన విచారణ గ్రామంలో కొనసాగలేదు. కేవలం కలకోటకు చెందిన ఓ పోస్ట్ మాన్ భర్త అయిన ప్రైవేటు వ్యక్తితో విచారణ అధికారి పాస్‌పుస్తకాలు సేకరిస్తుండటం విశేషం. గొల్లపూడి పోస్ట్ మెన్ మేడూరి శ్రీనివాసరావు గత సంవత్సర కాలంగా ప్రైవేటు వ్యక్తితో బ్రాంచ్ ఆఫీసును నిర్వహిస్తున్న విషయం తపాలా శాఖ ఉన్నతాధికారులకు తెలియదా
అనే చర్చ ప్రస్తుతం జరుగుతోంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ లను మెయిల్ ఓవర్సీస్ అధికారి తనిఖీ చేయాల్సి ఉంటుంది. వైరా, బోనకల్ మండలాలతో పాటు మధిర మండలంలోని కొన్ని గ్రామాలకు మెయిల్ ఓవర్సీస్ అధికారిగా ఆర్. కోటేశ్వరరావు పని చేస్తున్నారు. ఆయన ప్రతి మూడు నెలలకు ఈ పోస్ట్ ఆఫీస్ ను తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఈ తనిఖీలో రాండమ్ గా ఖాతాదారుల పాసు పుస్తకాలను పరిశీలించాల్సి ఉంటుంది. అయితే ఈ అధికారి తనిఖీకి వచ్చినప్పుడు బ్రాంచ్ ఆఫీసులో ప్రైవేటు వ్యక్తి ఉన్న విషయం గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం అందించలేదా అనే చర్చ ప్రస్తుతం జరుగుతుంది. ఈ అధికారి తన తనిఖీలు సక్రమంగా నిర్వహించి ఉంటే చిన్న మొత్తాల పొదుపు నగదు స్వాహా అయ్యేది కాదని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రైవేటు వ్యక్తిని ఉద్యోగంలో పెట్టుకున్న పోస్ట్ మాన్ పై సంవత్సర కాలంగా చర్యలు తీసుకోకుండా తమకు ఏమీ తెలియనట్లు నటిస్తున్న తపాలా శాఖ ఉద్యోగులు ప్రస్తుతం చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే సుఖమేమి ఉంటుందని ఖాతాదారులు ప్రశ్నిస్తున్నారు. సుమారు
100 మంది ఖాతాదారుల పాస్ పుస్తకాలు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఖాతాదారుల వద్ద పాస్ పుస్తకాలను ఇక్కడ పనిచేసిన ప్రైవేటు వ్యక్తి తన వద్ద పెట్టుకొని ప్రస్తుతం ఆ పాస్ పుస్తకాలు లేవని చెప్పడం విశేషం. మరోవైపు తాము జమ చేసిన నగదును మెయిన్ పోస్టల్ ఆఫీసులో ఎందుకు చెల్లించలేదని ప్రశ్నిస్తున్న వారిపై బెదిరింపులకు పాల్పడుతుండటం విశేషం. లక్షలాది రూపాయల స్వాహ వ్యవహారంలో పోస్టల్ శాఖ అధికారులు విచారణ చేసేందుకు తీవ్ర జాప్యం చేయడం వెనుక ఆంతర్యం ఏమిటోనని చర్చ జరుగుతుంది. పోస్ట్ మెన్ అనధికారికంగా నియమించిన ప్రైవేట్ వ్యక్తి గ్రామంలోని ఖాతాదారుల వద్ద తీసుకున్న నగదును పాస్ పుస్తకాల్లో ఎంటర్ చేయకుండా లక్షలాది రూపాయలు కాజేశాడు. పాస్ పుస్తకాల్లో తపాలా శాఖ రాజముద్ర వేసి ఎంటర్ చేసిన నగదును కూడా పోస్టల్ మెయిన్ బ్రాంచ్ లో ఖాతాదారుల ఖాతాల్లో జమ
చేయకుండా అందిన కాడికి దిగమింగాడు. ఇంత వ్యవహారం నడిచినా తపాలా శాఖ ఉన్నతాధికారులు లైట్ గా తీసుకోవడం విశేషం. గత ఐదు సంవత్సరాల క్రితం వైరా మండలంలోని ఖానాపురంలో చిన్న మొత్తాల పొదుపు నగదును స్వాహా చేసిన పోస్ట్ మెన్ పై తపాలా శాఖ ఉన్నతాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చీటింగ్ కేసు నమోదు అయింది. అంతే కాకుండా శాఖాపరమైన చర్యల్లో భాగంగా అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. అయితే గొల్లపూడి వ్యవహారంలో మాత్రం ఉన్నతాధికారులు ఆచితూచి అడుగులు వేయటం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. తపాలా శాఖ ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయిలో ప్రతి ఖాతాదారుడుని విచారిస్తే స్వాహా అయిన సొమ్ము 20 లక్షలు దాటుతుందని గ్రామస్తులే చెబుతున్నారు. మరోవైపు నష్టపోయిన ఖాతాదారులు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా తపాలా శాఖ ఉన్నతాధికారులు స్పందించి మిస్సయిన పాస్ పుస్తకాలను గుర్తించి ఖాతాదారులకు న్యాయం చేసి, నగదును స్వాహా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.