తెలంగాణాను అప్పులపాలు చేసింది కేసీఆర్ : కేంద్రమంత్రి బీఎల్.వర్మ

by Sumithra |
తెలంగాణాను అప్పులపాలు చేసింది కేసీఆర్ : కేంద్రమంత్రి బీఎల్.వర్మ
X

దిశ, భద్రాచలం : తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుల పాలు చేశారని, 60 వేల కోట్ల మిగులు బడ్జెట్ తో రాష్ట్రం ఏర్పడితే 9 సంవత్సరాలలో 5 లక్షల కోట్ల రూపాయలు అప్పుచేసి రాష్ట్రాన్ని అదోగతి పాలు చేసిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందని కేంద్ర మంత్రి బి.ఎల్.వర్మ ఆరోపించారు. సోమవారం జన్ సంపర్క్ అభియాన్లో భాగంగా భద్రాచలం అసెంబ్లీ స్థాయి కార్యకర్తలు, బీజేపీ అనుబంధ మోర్చలకు దిశా నిర్దేశం చేసేందుకు ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిధిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ నిధులను దారి మల్లించి, కేసీఆర్ తానే పథకాలు అమలు చేస్తున్నట్లు ప్రగల్బాలు పలుకుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన, సుకన్య సమృద్ధి యోజన, జన్ ధన్ యోజన, జనని సురక్షా యోజన లాంటి అనేక సంక్షేమ పధకాలు అమలు చేస్తుందని అన్నారు. దేశ ప్రజలు నరేంద్ర మోడీ నాయకత్వం కోరుకుంటున్నారని, వచ్చే ఎన్నికలలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి కుంజా సత్యావతి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రం రాజు బెహరా, ఉపాధ్యక్షులు నాగబాబు, భద్రాచలం అసెంబ్లీ కన్వినర్ త్రినాదరావు, గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చెరుకూరి సతీష్, భద్రాచలం అధ్యక్షులు రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed