తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కేసీఆర్ వద్ద తాకట్టు

by Sridhar Babu |   ( Updated:2023-11-16 09:04:41.0  )
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కేసీఆర్ వద్ద తాకట్టు
X

దిశ,తిరుమలాయపాలెం : రాష్ట్రంలో ఈ నాటి పరిస్థితులు చూస్తుంటే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కేసీఆర్ వద్ద తాకట్టు పెట్టినట్టుందని పాలేరు ఎమ్మెల్యే అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం తిరుమలాయపాలెం మండలంలోని పలు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. కేసీఆర్ ను రెండుసార్లు ముఖ్యమంత్రి చేస్తే రాష్ట్రానికి ఏమి చేశాడని ఆరోపించారు. నీళ్లు, నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు, పేదలకు ఇండ్లు, రేషన్ కార్డ్ లు లేవని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం దోచుకోవడానికే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నట్టు ఉన్నదని విమర్శించాడు. కేసీఆర్ రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రి అయి ఏమి చేశాడని ఆరోపించాడు. మళ్లీ తిరిగి మంచి రోజులు రావాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తప్పక రావాలన్నారు. అందుకోసం ప్రజలాంతా హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.

Advertisement

Next Story