భారీ వర్షం, పెనుగాలులతో నష్టపోయిన పంటల రైతులను ఆదుకోండి..

by Sumithra |
భారీ వర్షం, పెనుగాలులతో నష్టపోయిన పంటల రైతులను ఆదుకోండి..
X

దిశ, సత్తుపల్లి : సత్తుపల్లి నియోజకవర్గంలో సంభవించిన పెనుగాలులతో కూడిన వర్షానికి నష్టం జరిగిన మామిడి, మొక్కజొన్న తదితర పంటల రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య హైదరాబాదలోని ప్రగతి భవన్లో కలిసి కోరారు. చేతికొస్తున్న పంటలు పెనుగాలులు, వర్షం కారణంగా తీవ్రంగా నష్టం వాటిల్లిందని పంటనష్టం జరిగిన తీరును దెబ్బతిన్న పంటపొలాల ఫోటోలు వివరాలను ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అందజేసి రైతులను ఆదుకోవాలని కోరారు.

అదేవిధంగా తెలంగాణ రాష్ట్రప్రభుత్వం పై నమ్మకంతో సీతారామ ప్రాజెక్టు కొరకు సహకరించి నష్టపరిహారాన్ని పొందకు ముందే భూములను ఇచ్చిన సత్తుపల్లి మండల పరిధిలోని రుద్రాక్షపల్లి, బుగ్గపాడు, యాతలకుంట గ్రామాలకు చెందిన నిర్వాసిత రైతులకు ఆర్థిక శాఖ, ఇరిగేషన్ శాఖలకు ఆదేశాల ఇచ్చి పరిహారాన్ని సత్వరంగా అందించాలని కోరారు. సీతారామ ప్రాజెక్టుపనుల పురోగతి పై సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ కి ఆదేశాలు ఇచ్చి త్వరితగతిన పనులను పూర్తిచేసి నీరు అందించే విధంగా చూడాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed