- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీల్లో 'సాయిస్ఫూర్తి' ప్రథమస్థానం
దిశ, సత్తుపల్లి: మండల పరిధిలోని గంగారం సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ విభాగం విద్యార్థలు ఇటీవల ఫిబ్రవరి 9,10 తేదీల్లో అనురాగ్ పాలిటెక్నిక్ కళాశాల మైదానం ఆవరణలో కోదాడ, నల్లగొండ జిల్లాలో వాలీబాల్ పోటీలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది ఉమ్మడి జిల్లాలు పాల్గొన్నాయి. ఫైనల్లో అనురాగ్ పాలిటెక్నిక్ కళాశాలపై సాయిస్ఫూర్తి పాలిటెక్నిక్ కళాశాల విజయం సాధించి విజేతగా నిలిచిందని ఫిజికల్ డైరెక్టర్ రఘుపతిరెడ్డి తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేవలం సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్, పాలిటెక్నికల్ విభాగం విద్యార్థులు మాత్రమే ఎక్కువ విజయాలు సాధించి జిల్లాకి పేరు ప్రతిష్టలు ఇనుమడింపజేశారని అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా విద్యార్థులు పాల్గొని మంచి మరిన్ని విజయాలు సాధిచాలని ఆకాంక్షించారు. కళాశాల ప్రిన్సిపాల్ శేషారత్న కుమారి మాట్లాడుతూ విజయం సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ దాసరి ప్రభాకర్ రెడ్డి, డైరెక్టర్ చెన్నుపాటి. విజయకుమార్, డిప్లొమా డీన్ తోమండ్రు.రాంబాబు, ఆయా డిపార్టుమెంట్ ల హెచ్ వో డీలు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.