Quality food : విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి..

by Sumithra |   ( Updated:2024-07-26 17:04:52.0  )
Quality food : విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి..
X

దిశ, సత్తుపల్లి : విద్యార్థులకు నాణ్యమైన భోజనం విద్యను అందించాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ కోరారు. సత్తుపల్లి పట్టణ పరిధిలోని తెలంగాణ ముస్లిం రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలకు ఆయన ఆకస్మికంగా పర్యటించి విద్యార్థులకు అందుతున్న భోజన వసతి, విద్య పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం భోజనం రుచికరంగా ఉండటం లేదని, నాణ్యత పాటించటం లేదని ఫిర్యాదు చేయగా వెంటనే ప్రిన్సిపల్ హాస్టల్ వార్డెన్ తో మాట్లాడి విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

అనంతరం విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత, వసతి, తరగతి గదులను పరిశీలించారు. ఈ పర్యటనలో ప్రిన్సిపల్ వెంకటరామయ్య, సత్తుపల్లి మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ తోటా సుజలా రాణి, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చల్లగుళ్ళ నరసింహారావు, ఎండీ కమల్ పాషా, మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనంద్, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు హాస్టల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story
null