- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pinapaka MLA : రైతులు పత్తి కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి
దిశ,బూర్గంపాడు : రైతులు సీసీఐ ద్వారా ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.సోమవారం బూర్గంపాడు మండలం లో లక్ష్మీపురం గ్రామంలో గల జిన్నింగ్ మిల్లులో సీసీఐ ద్వారా చేపట్టిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని అన్నారు.రైతులు తమ పండించిన పంటలను ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్దే అమ్మాలని సూచించారు.1 క్వింటాలు పత్తిని రూ.7521 లతో కొనుగోలు చేస్తోందని తెలిపారు.తేమ 12 శాతం కంటే ఎక్కువ మించకుండా చూసుకోవాలన్నారు.
రైతులు తమ పంట ను అమ్మేటప్పుడు తప్పని సరిగా ఆధార్ కార్డు,నిత్యం వాడుకలో ఉన్న బ్యాంకు పాస్ బుక్ వెంట తీసుకొని రావాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని,ప్రజా ప్రభుత్వంలో రైతులకు అన్ని రకాలుగా అభివృద్ధి పరచడం తమ లక్ష్యమన్నారు.ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ శ్రీనివాసరావు,వ్యవసాయ శాఖ అధికారులు, బూర్గంపాడు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు దుర్గంపూడి కృష్ణా రెడ్డి , మాజీ పీఏసీఎస్ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, పీసీసీ సభ్యులు తాళ్లూరి చక్రవర్తి,మైనార్టీ జిల్లా చైర్మన్ మొహమ్మద్ ఖాన్, కాంగ్రెస్ జిల్లా నాయకులు చల్లా వెంకటనారాయణ,లక్ష్మీపురం మాజీ ఉప సర్పంచ్ పోతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి,బెల్లంకొండ వాసుదేవరావు, బెల్లంకొండ రామారావు, కణితి కృష్ణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.