- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫైన్లతోనే సరి..మట్టి తరలింపుపై చర్యలేవి..?
తిరుమలాయపాలెం మండలంలో మట్టి తరలింపు యథేచ్ఛగా కొనసాగుతున్నది. నియంత్రించాల్సిన సంబంధింత అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ఒకవేళ పట్టుకున్నా నామమాత్రంగా ఫైన్లు వేసి వదిలేస్తున్నారు. దీంతో అక్రమార్కులు మట్టి దందాను మూడుపువ్వులు ఆరుకాయలుగా మలచుకుంటున్నారు.
మండలంలోని పిండిప్రోలు గ్రామానికి చెందిన ఇద్దరు, ఖమ్మం రూరల్ మండలం బారిగూడెం గ్రామానికి చెందిన ఓ..వ్యక్తి అక్రమ మట్టి వ్యాపారులుగా అవతారమెత్తారని, వీరు ఒక టీంలా ఏర్పడి జోరుగా మట్టి తరలిస్తున్నారు. ఇక్కడి నుంచి ఖమ్మం రూరల్, కూసుమంచి మండలాలకు, మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లాల్లో నిర్మిస్తున్న పలు ప్రైవేట్ కన్‌స్ట్రక్షన్స్, నూతనంగా ఏర్పాటు చేస్తున్న ప్రైవేట్ వెంచర్లకు తరలిస్తున్నట్లు సమాచారం. రాత్రి, పగలనే తేడా లేకుండా డంపర్ల ద్వారా రోజుకు వందల సంఖ్యల ట్రక్కుల మట్టి తరలిపోతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై అనుమానం వస్తున్నది. వారి నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతున్నది. మట్టి తరలిస్తున్న అక్రమార్కుల్లో ఒకరు అధికార పార్టీ జిల్లా అధ్యక్షుడికి స్వయాన సోదరుడు కొడుకు కావడం విశేషం.
దిశ, తిరుమలాయపాలెం : తిరుమలాయపాలెం మండల పరిధిలోని తిరుమలాయపాలెం, రమణతండా, ఎదుళ్లచెర్వు, పిండిప్రోలు గ్రామాల ప్రభుత్వ, పట్టా భూములను అడ్డాగా చేసుకున్నారు. ఆ ప్రాంతం నుంచి స్థానిక మండలం చుట్టుపక్క ప్రాంతాలు, ఖమ్మం రూరల్, కూసుమంచి మండలాలతో పాటు, మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లాల్లో నిర్మిస్తున్న పలు ప్రైవేట్ కన్‌స్ట్రక్షన్స్, నూతనంగా ఏర్పాటు చేస్తున్న ప్రైవేట్ వెంచర్లల్లో ఒప్పందం చేసుకుంటారు. ఇక రాత్రి, పగలనే తేడా లేకుండా, డంపర్ల ద్వారా రోజుకు వందల సంఖ్యల ట్రక్కుల మట్టిని తరలిస్తున్నారు.
సహజంగా అవసరం నిమిత్తం మట్టి తరలించాలంటే స్థానిక రెవెన్యూ, మైనింగ్ శాఖల నుంచి అనుమతులు పొందాలి, కానీ అక్రమార్కులు సంబంధించిన శాఖల నుంచి ఏరకమైన అనుమతులు పొందకుండా, రోజుకు రూ.లక్షల రూపాయల అక్రమ మట్టి వ్యాపారం చేస్తూ.. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన మైనింగ్,రెవెన్యూ అధికారాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ఒకవేళ పట్టుకున్నా నామమాత్రపు ఫైన్లు విధించి వదిలేస్తున్నారు. నామమాత్రపు ఫైన్లకు బయపడని అక్రమ మట్టి వ్యాపారులు దర్జాగా దందా సాగిస్తున్నారు. అక్రమ మట్టి వ్యాపారం అవతారమెత్తిన ముగ్గురిలో ఒకరు అధికార పార్టీ జిల్లా అధ్యక్షుడి స్వయాన సోదరుడు కొడుకు కావడం విశేషం.
అరకొర పర్యవేక్షణలో అధికారులు
అక్రమార్కులు అడ్డు అదుపులేకుండా, అక్రమంగా లక్షల రూపాయల మట్టి వ్యాపారం సాగిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు అరకొర పర్యవేక్షణతో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా అక్రమార్కులు రెచ్చిపోతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం వారికి అక్రమార్కులకు ఉన్నా చీకటి స్నేహానికి అద్దంపడుతున్నది. దీంతో ఈతతంగం మొత్తం సంబంధించిన అధికారుల కనుసైగల్లోనే జరుగుతున్నదనే ఆరోపణలు సైతం పలువురి నోట బలంగా వినిపిస్తున్నాయి. కలెక్టర్ స్పందించి అక్రమార్కులకు అడ్డుకట్ట వేసి,ప్రభుత్వ భూములు కాపాడాలని మండల ప్రజలు కోరుతున్నారు.