బీపీది నీతిలేని రాజకీయం.. మంత్రి పువ్వాడ పీఏ ఆగ్రహం

by Disha News Web Desk |
బీపీది నీతిలేని రాజకీయం.. మంత్రి పువ్వాడ పీఏ ఆగ్రహం
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: రాజకీయంగా ఎదుర్కోలేకే తనపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి పువ్వాడ అజయ్ వ్యక్తిగత సహాయకుడు చిరుమామిళ్ల రవి కిరణ్ పేర్కొన్నారు. మంగళవారం ఓ ప్రకటనలో తనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ప్రజాసేవలో నిమగ్నమైన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు తను వ్యక్తిగత సహాయకుడిగా ప్రజలకు, మంత్రికి మధ్య వారధిగా సేవలందిస్తున్న తనపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తరుచూ తన వద్దకు పలువురు మంత్రి సాయం కోసం వస్తుంటారని, ఈ సందర్భంగా మా మధ్య అవినాభావ సంబంధాన్ని ఏర్పరచుకుంటామే తప్పా, మరే విధంగా కుటుంబ బంధుత్వం ఉండదని తెలిపారు. మైనింగ్ వ్యాపారం అంటూ నీతిలేని రాజకీయానికి ఖమ్మం జిల్లా బీజేపీ నాయకులు తెరతీసి, తనను బలి చక్రవర్తిని చేసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. దీనిలో పలువురు బీజేపీ అనుబంధ మీడియా ప్రతినిధులు ఉన్నారని ఆరోపించారు. తాజాగా ఈ సరికొత్త డ్రామా మొదలుపెట్టి తాత్కాలికంగా పబ్బం గడిచిపోతే చాలని బీజేపీ నాయకులు ప్రగల్భాలు పలుకుతున్నారని రవి కిరణ్ పేర్కొన్నారు.

Advertisement

Next Story