Minister Ponguleti: టూ వీలర్ స్కిడ్.. మంత్రి పొంగులేటికి స్వల్ప గాయాలు

by Shiva |   ( Updated:2024-09-02 15:15:03.0  )
Minister Ponguleti: టూ వీలర్ స్కిడ్.. మంత్రి పొంగులేటికి స్వల్ప గాయాలు
X

దిశ, ఖమ్మం రూరల్: మండలంలోని వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి‌ ఎడమ కాలుకు స్వల్ప గాయాలయ్యాయి. సోమవారం ఉదయం 7 గంటల నుంచి ఆయన మండల పరిధిలోని జలగం నగర్, కేబీఆర్ నగర్, టెంపుల్ సిటీ, నాయుడుపేట వరద ముంపు బాధితులను పరామర్శించారు. అనంతరం పొంగులేటి ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ కాలనీ‌లోని వరద బాధితులను పరామర్శించడానికి టు వీలర్‌పై వెళ్లారు. ఈ క్రమంలోనే కాలనీలో బండి ఒక్కసారిగా స్కిడ్ అయి జారి పడిపోయారు. వెంటనే ఆయనను భద్రతా సిబ్బంది క్యాంప్ ఆఫీస్‌కు తరలించారు. జిల్లా ప్రభుత్వ వైద్యుడ రాజశేఖర గౌడ్ ఆయనకు ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story