Pidamarthy Ravi : రాష్ట్ర వ్యాప్తంగా మాదిగ సమ్మేళనాలు

by Sridhar Babu |
Pidamarthy Ravi : రాష్ట్ర వ్యాప్తంగా మాదిగ సమ్మేళనాలు
X

దిశ, వైరా : రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు 12% రిజర్వేషన్ సాధనకు మాదిగ జేఏసీని ఏర్పాటు చేసి తెలంగాణలో గత 12 సంవత్సరాల నుంచి ఉద్యమిస్తున్నామని మాదిగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు పిడమర్తి రవి (Pidamarthy ravi) అన్నారు. శనివారం వేల్పుల మురళి అధ్యక్షతన వైరాలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముప్పై ఏళ్ల మాదిగ ఉద్యమం సుప్రీం కోర్టు తీర్పుతో అంతిమ దశ కు చేరిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ లను జిల్లాను యూనిట్ గా తీసుకుని చేపట్టాలని, అప్పుడే మాదిగలకు న్యాయం జరుగుతుందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మూస విధానంతో ఉద్యమాలు చేయొద్దని జాతి ప్రయోజనం ముఖ్యం అని తెలిపారు.

మాదిగలకు 12% రిజర్వేషన్ కల్పించాలని, జిల్లాను యూనిట్ గా చేసి వర్గీకరణ చేయాలనే డిమాండ్స్ తో రాష్ట్ర వ్యాప్తంగా మాదిగ సమ్మేళనాలు నిర్వహిస్తూ మాదిగల్లో 12% రిజర్వేషన్, జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ పట్ల అవగాహనా కలిగిస్తూ ఈ విషయాల పై మాదిగలను చైతన్య పరుస్తున్నామని తెలిపారు. జనాభా నిష్పత్తి ప్రకారం వర్గీకరణ చేయాలని రాష్ట్రంలో బలమైన ఉద్యమం నిర్మిస్తామని అన్నారు. వర్గీకరణ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల మాదిగలకు సంపూర్ణ విశ్వాసం ఉందని ఈ సందర్బంగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాదిగ రాజకీయ వేదిక రాష్ట్ర అధ్యక్షులు వక్కల గడ్డ సోమచంద్రశేఖర్, మాదిగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ కొడారి ధీరన్, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్​చార్జి మాట్టే గురుమూర్తి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొండమీది గోవిందరావు, నాయకులు దేవరకొండ నరేష్, నక్క మహేష్, ఆదూరి ప్రేమ్ కుమార్, కాకాటి నరసింహారావు, పమ్మి దాసు, కుక్కల నాగభూషణం, చాట్ల దానియేలు, మోదుగు సురేష్, దేవరపల్లి కాంతారావు, పమ్మి రాజు, పింగళి చలపతి,మమ్మీ సాయి, పిడియాల నరేష్, మోదుగు కృష్ణ, మోదుగు నాగరాజు, కర్ల గంటి శ్రీహరి, మోదుగు సుధాకర్, మోదుగు శీను, పెద్ద ఎత్తున కాలనీ మహిళలు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Advertisement

Next Story