కుల భోజనాలు వద్దు.. జన భోజనాలు చేద్దాం రండి..

by Sumithra |
కుల భోజనాలు వద్దు.. జన భోజనాలు చేద్దాం రండి..
X

దిశ, ఖమ్మం టౌన్ : డిసెంబర్ 1న ఎస్ ఎఫ్ ఎస్ స్కూల్ వెనక గల మలీదు జగన్ మామిడి తోటలో సకల జన భోజన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ పిలుపునిచ్చింది. మంగళవారం స్థానిక రామ నరసయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆవుల అశోక్ స్పర్శ అధ్యయన వేదిక బాధ్యులు కాకి భాస్కర్, పార్టీ డివిజన కార్యదర్శి ఝాన్సీలు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కార్తీక మాసంలో కుల సమీకరణాలు ప్రోత్సహించేందుకు కుల భోజనాల సందడి విపరీతంగా పెరిగిందని, పనిలో పాటలో సకల ఉత్పత్తిలో కలిసిమెలిసి ఉన్న ప్రజలు కార్తీక మాసంలో కులాల వారీగా భోజనాలు కార్యక్రమాలు చేయటం కులాన్ని మతాన్ని కూలిపోకుండా కాపాడడంలో భాగంగానే కొందరు ఇటువంటి భావజాలాన్ని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ సంస్కృతి లో భాగంగా మానవత్వం పరిమళించే మంచి మనసులతో కుల భోజనాలను వ్యతిరేకిస్తూ జన భోజనాలు చేద్దాం రండి అనే నినాదంతో సకల జన భోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు.

వన భోజనాల పేరిట జరిగే కులభోజనాలను బహిష్కరించాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.కుల పునాదుల మీద ఒక నీతిని గాని జాతిని కానీ నిర్మించలేమని అంబేద్కర్ అన్న మాటలను వారు గుర్తు చేశారు . ఆధిపత్య కులాల సమీకరణ అన్ని రంగాల్లో వాళ్ళ ఆధిపత్యాన్ని కొనసాగించటం కోసం జరుగుతుందని, ఉత్పత్తి కులాల సమీకరణ అగ్రకుల అధిపత్యాలను వ్యతిరేకించే స్ఫూర్తి లేకుండా జరుగుతున్నాయని వారి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. బుద్ధి జీవులుగా మనుషులుగా ప్రజాస్వామిక వాదులుగా కుల భోజనాల్ని వ్యతిరేకిస్తూ, కుల నిర్మూలన చైతన్యం తో జన భోజనాల కార్యక్రమాల విస్తృతంగా పాల్గొనాలని వారి సందర్భంగా పిలుపునిచ్చారు. జన భోజనాల కార్యక్రమానికి అన్ని రకాలుగా సహకరించి భాగస్వామ్యం కావాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో నాయకులు సిహెచ్ శిరోమణి, కొల్లేటి నాగేశ్వరరావు, కే శ్రీనివాస్, మంగతాయి,శోభ, లక్ష్మణ్, తేజ నాయక్, రాకేష్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed