- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపే వ్యక్తి కేసీఆర్ ఒక్కరే: తుమ్మల
దిశ, మణుగూరు: తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపే వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరేనని.. మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ తొమ్మిది సంవత్సరాల అభివృద్ధిని ఒక్కసారి ప్రజలు చూసి.. మూడోసారి బీఆర్ఎస్ పార్టీని ఆదరించి.. గెలిపించాలని తుమ్మల కోరారు. మణుగూరులో మంగళవారం జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జడ్పీ హై స్కూల్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి జిల్లా అభివృద్ధి కోసం ఇప్పటి వరకు రూ, 45 వేల కోట్లను మంజూరు చేశారని.. ప్రధాన సమస్యలైన తాగునీరు, సాగునీరు, విద్యుత్, రహదారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు అందించారన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిన ఏకైక వ్యక్తి కేసీఆర్ ..అని
పినపాక నియోజకవర్గ అభివృద్ధికి నిత్యం శ్రమించే వ్యక్తి రేగా కాంతారావు అని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర నుండి అనేక కోట్ల రూపాయల నిధులను తెచ్చి నియోజకవర్గ అభివృద్ధి కోసం రేగా పాటు పడ్డారని తుమ్మల అన్నారు. జాతీయ రహదారులు, ప్రాజెక్టులు, పరిశ్రమలతో అభివృద్ధి చెందుతున్న పినపాక నియోజకవర్గం మరింత అభివృద్ధి కావాలంటే మళ్ళీ రేగా కాంతారావు ను గెలిపించుకోవాలన్నారు.