- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వైరాలో జర్నలిస్టుల రిలే నిరాహార దీక్ష
దిశ, వైరా: తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ వైరాలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు గురువారం నుంచి రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వైరాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు భాగంలో జాతీయ రహదారి పక్కన రిలే నిరాహార దీక్ష నిర్వహిస్తున్నారు. ముందుగా జర్నలిస్టులు వైరాలో ర్యాలీ నిర్వహించారు. జర్నలిస్టుల దీక్షా శిబిరాన్ని వైరా మున్సిపాలిటీ చైర్మన్ సూతకాని జైపాల్, టీడీపీ మండల అధ్యక్షుడు చెరుకూరి చలపతి, సీపీఐ ఎంఎల్ నాయకులు కంకణాల అర్జునరావుతోపాటు పలువురు సందర్శించి జర్నలిస్టులకు తమ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ ఇళ్ల స్థలాల కేటాయింపులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యేకు నాలుగేళ్లుగా వినతి పత్రాలు అందిస్తున్నా నేటి వరకు తమకు ఇళ్ల స్థలాలు కేటాయించడంలేదని అన్నారు. తమకు ఇళ్ల స్థలాలు కేటాయించేంతవరకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైరా జర్నలిస్టులు పాల్గొన్నారు.