- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్కడ TRS లో విచిత్ర పరిస్థితి.. ఇద్దరు మాజీలు టికెట్ కోసం పోటీ
దిశ, వైరా: వైరాలో ఎర్ర గులాబీ వికసించేనా అనే చర్చ నేడు ప్రధానంగా వినిపిస్తుంది. వైరా నియోజకవర్గ టీఆర్ఎస్‌లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఇక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యే తో పాటు మరో ఇద్దరు మాజీలు టీఆర్ఎస్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. తాజాతో పాటు మాజీ ఎమ్మెల్యేలు అందరూ ఈసారి తమకే టికెట్ వస్తుందని విస్తృతంగా వైరా నియోజకవర్గంలో ప్రచారం చేసుకున్నారు. ఇటీవల అకస్మాత్తుగా వచ్చిన మునుగోడు ఉప ఎన్నిక ఈ నాయకుల ఆశలపై నీళ్లు చల్లింది. మునుగోడులో గెలుపే అంతిమ లక్ష్యంగా సీఎం కేసీఆర్ రాజకీయ ప్రణాళిక రచించారు. అందులో భాగంగానే మునుగోడులో బలమున్న కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. అయితే ఈ ఎన్నికల్లో కమ్యూనిస్టు ఓట్లతోనే టీఆర్ఎస్ గెలిచిందనే విషయం సీఎం కేసీఆర్ తో పాటు రాష్ట్ర ప్రజలకు తెలియంది కాదు.
దీంతో సీఎం కేసీఆర్ వచ్చే సాధారణ ఎన్నికల్లో కూడా కమ్యూనిస్టులతో కలిసి నడవాలని ఆలోచన చేస్తున్నది అందరికీ తెలిసిందే. ఈ మునుగోడు పొత్తే వైరా నియోజకవర్గ టీఆర్ఎస్ ఆశావాహులు, ప్రస్తుత ఎమ్మెల్యే కొంప ముంచుతుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇటీవల సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖమ్మం రూరల్ మండలం లో టీఆర్ఎస్తో కమ్యూనిస్టులకు పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. అంతేకాకుండా జిల్లాలో కమ్యూనిస్టుల బలం నిరూపించుకుంటామని పాలేరులో సీపీఎం పోటీ చేస్తుందని చెప్పకనే చెప్పారు. దీంతో టీఆర్ఎస్ కమ్యూనిస్టుల పొత్తు కొనసాగుతుందనేది స్పష్టమైనది.
వైరా సీపీఐకే కేటాయిస్తారా..
నియోజకవర్గ పునర్విభజన లో నూతనంగా ఏర్పడిన వైరా నియోజకవర్గంలో సాధారణ ఎన్నికల్లో సీపీఐ ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా ఆ పార్టీకే వైరా సీటును కేటాయించారు. 2009 ఎన్నికల్లో మహాకూటమి సీపీఐ అభ్యర్థిగా బానోత్ చంద్రావతి పోటీ చేసి గెలుపొందారు. 2014లో కాంగ్రెస్ మద్దతుతో సీపీఐ అభ్యర్థిగా మూడు నారాయణ, 2019లో టీడీపీ, కాంగ్రెస్ మద్దతుతో సీపీఐ అభ్యర్థిగా విజయభాయ్ పోటీ చేసి ఓడిపోయారు. టీఆర్ఎస్ తరఫున వైరా నియోజకవర్గంలో ఎన్నికల్లో నేరుగా గెలిచిన అభ్యర్థులు లేరు. ఇతర పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సమీకరణాల నేపథ్యంలో వైరాలో సీపీఐ పోటీ చేసేందుకు అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకే వైరా నియోజకవర్గంలోని ఒక ఎర్ర గులాబీ తీవ్ర ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.
సీపీఐ పై కన్ను..
ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న వైరా నియోజకవర్గ మాజీ ప్రజా ప్రతినిధి సీపీఐ పై కన్ను వేసినట్లు ప్రచారం జరుగుతుంది. రాజకీయ సమీకరణ నేపథ్యంలో టీఆర్ఎస్ వైరా టికెట్టు సీపీఐ కి కేటాయించే ఛాన్స్ అధికంగా ఉంది. దీంతో టీఆర్ఎస్‌లో తనకు మనుగడ ఉండదని తెలుసుకున్న ఆ మాజీ ప్రజా ప్రతినిధి తనకున్న పాత పరిచయాలతో కారు పార్టీలోని ఖమ్మం పెద్దల సహకారంతో సీపీఐ కు చేరువై ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆశతో ఉన్నట్టు సమాచారం. అందులో భాగంగానే సదరు మాజీ ప్రజా ప్రతినిధి కారు దిగి కంకి కొడవలిని భుజానికి ఎత్తుకునేందుకు ఆరాటపడుతుందని ప్రచారం జరుగుతుంది. సదరు మాజీ ప్రజాప్రతినిధిని వైరా సీపీఐ లో చేర్చడం వల్ల జిల్లాలోని అధికార పార్టీ పెద్దలకు స్వామి కార్యం... స్వకార్యం అయినట్లు రెండు ప్రయోజనాలు చేకూరుతాయని తెలిసింది. మాజీ ప్రజా ప్రతినిధిని సీపీఐ లో మరలా చేర్చి గెలిపిస్తే ఎర్ర పార్టీలో ఉన్నప్పటికీ తమ వ్యక్తిగానే కొనసాగుతున్నదనేది మొదటి ప్రయోజనం.
ఒకవేళ సదరు ప్రజాప్రతినిధి గెలిచి ఆ తర్వాత కమ్యూనిస్టులు టీఆర్ఎస్ పొత్తులు వికటించినా ఆ మాజీ ప్రజాప్రతినిధికి వెంటనే గులాబీ కండువా కప్పి క్షణాల్లో పార్టీలో చేర్చుకోవచ్చు అనేది రెండో ప్రయోజనం. అయితే సదరు మాజీ ప్రజాప్రతినిధికి వైరా నియోజకవర్గంలో ఏ గ్రామంలో కూడా తన సొంత వర్గం లేదు. గతంలో ఆ మాజీ ప్రజా ప్రతినిధి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. అంతేకాకుండా అప్పట్లో ఆ మాజీ ప్రజా ప్రతినిధి వెంట ఉన్న వైరా మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన ఓ నాయకుడు తో సహా అన్ని మండలాల్లోని ప్రముఖ నాయకులు అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. ఎటువైపు చూసినా సదరు మాజీ ప్రజా ప్రతినిధి పై సానుకూలత కంటే వ్యతిరేక పవనాలే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కారు దిగి కంకి కొడవలి భుజానికి ఎత్తుకున్న ఆ మాజీ ప్రజా ప్రతినిధిని వైరా నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తారనే నమ్మకం లేదు. ఈ నేపథ్యంలో చివరికి ఏమి జరుగుతుందో వేచి చూడాలి.
Read more:
12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌లో చేర్చుకొన్న కేసీఆర్‌ను దేంతో కొట్టాలి..? మల్లు రవి
- Tags
- trs