ప్రభుత్వ భూమిలో అక్రమ డంపింగ్​..!

by Sumithra |
ప్రభుత్వ భూమిలో అక్రమ డంపింగ్​..!
X

దిశ, ఖమ్మం రూరల్​ : అక్రమార్కులకు కంటికి కనిపిస్తే చాలు దానిని క్యాష్​ చేసుకునే పనిలో నిమగ్నమౌతారు. అది ప్రభుత్వ భూమి అయితే ఇంకా అడ్డేముంది. ఇష్టారాజ్యంతో వ్యవహరించడంతో పాటు భవిష్యత్తులో ఏదైనా ప్రభుత్వ అవసరాలకు ఉపయోగపడని విధంగా డంపింగ్​ చేస్తున్నారు.. కొంతమంది అక్రమార్కులు ఇదంతా రూరల్​ మండలం వెంకటగిరి ప్రాంతంలో సాగుతున్నది. రూరల్​ మండలం గుదిమళ్ల రెవెన్యూ గ్రామమైన వెంకటగిరిలో హైవేకి దగ్గరలో ప్రభుత్వ భూమిలో అక్రమంగా గ్రానైట్​ రాళ్లను డంపిగ్​ చేస్తున్నారు.

ప్రభుత్వ భూమిలో సుమారు 40 అడుగులకు పైగా ఎత్తులో డంపింగ్​ చేస్తున్నారు. ఈ ప్రభుత్వ భూమి కోదాడ టూ ఖమ్మం హై కి దగ్గరలో ఉండటంతో భవిష్యత్తులో ప్రభుత్వ పరమైన అవసరాలకు వినియోగించాలంటే ఇంత పెద్ద డంప్​ను తరలించేది ఎట్లా అనేది పెద్ద ప్రశ్న. వెంకటగిరి రెవెన్యూ ముదిగొండకు సమీపంలో ఉండటంతో అక్కడ ఉన్న గ్రానైట్​ ఫ్యాక్టరీలో నుంచి వచ్చే గ్రానైట్ రాళ్లను కొందరు టిప్పర్లతో ప్రభుత్వ భూమిలో గత నెలలుగా డంపింగ్​ చేస్తున్నారు.​ పేదలకు ఇండ్ల ఇవ్వాలన్న, ఎదైన ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాలన్న ఈ డంపింగ్​ తరలించడం కత్తి మీద సాము లాంటిదే. అక్రమణదారులు తమ ఇష్టం వచ్చినట్లు డంప్​ చేసి క్యాష్​ చేసుకోవడమే పనిగా నిమగ్నమయ్యారు.

సొమ్ము చేసుకుంటున్న అక్రమణదారులు..

అక్రమణదారులు ఒక్కొ టిప్పర్​ రాళ్లను గ్రానైట్​ ఫ్యాక్టరీ నుంచి తరలించేందుకు సుమారు ఆరు వందలకు పైగానే కిరాయి తీసుకుని వారికి ఇష్టం వచ్చిన చోట డంపింగ్​ చేయడం వీరి పని. అక్రమణదారులు ప్రభుత్వ భూమితో పాటు గుర్రలపాడు నుంచి ముదిగొండ రహదారి పక్కన కూడ పోయడంతో గతంలో అనేక రోడ్డు ప్రమాదాలు కూడా జరిగిన సంఘటనలు ఉన్నాయి. రహదారి పక్కనే రాళ్ల వేయడం వలన ఏదైనా టూవీలర్​ కానీ, కారు ఇతరత్రా వాహనాలు దారి తప్పితే వారి జీవింతం అధోగతిపాలే. అటువంటి సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. అయిన కానీ అక్రమంగా డంపింగ్​ చేయడం వారు ఆపకపోగా వారు ఇష్టం వచ్చినట్లు పోయడం క్యాష్​ చేసుకోవడమే వారి పని.

డంపింగ్​ చేయాలంటే ఎదైనా పాతక్వారీలో డంపింగ్​ చేయాలన్నా నిబంధన కూడా ఉంది. రూరల్​ మండలంలోని పోలేపల్లి పరిధిలో ఓ పాత క్వారీలో డంపింగ్​ వేసుకొనుటకు అనుమతి ఇచ్చిన అక్రమణదారులు మాత్రం తమకు ఇష్టం వచ్చిన చోట పోసి ఇటు ప్రజలను అటు ప్రభుత్వ స్థలాలకు అడ్డంకిగా మారుతున్నారు. ఇటువంటి అక్రమణ డంపింగ్​ల పై అధికారులు సమగ్ర దృష్టిసారించి మండలంలో సాగుతున్న అక్రమ డంపింగ్​దారుల పై తగు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story