స్థానికుల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలి.. సీపీఎం పట్టణ కమిటీ

by Disha News Desk |
స్థానికుల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలి.. సీపీఎం పట్టణ కమిటీ
X

దిశ, భద్రాచలం అర్బన్: పట్టణంలోని సుందరయ్య కాలనీ వద్ద నూతనంగా నిర్మిస్తున్న డంపింగ్ యార్డు పనులను సీపీఎం పార్టీ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా స్థానిక సుందరయ్య కాలనీ గిరిజన ప్రజలు డంపింగ్ యార్డును తమ కాలనీకి సమీపంలో నిర్మించడం వల్ల తమకు ఇబ్బందులు ఏర్పడతాయని, డంపింగ్ యార్డ్ నిర్మాణ స్థలాన్ని మార్చాలని అధికారులను కోరినట్లు సీపీఎం బృందం దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు మాట్లాడుతూ.. డంపింగ్ యార్డ్ నిర్మాణంలో స్థానిక ప్రజల అభిప్రాయం తెలుసుకోకుండా అధికార యంత్రాంగం ఏకపక్షంగా వ్యవహరించిందని అన్నారు.

ఈ పరిస్థితి రావడానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన రీతిలో స్పందించకపోవడమే అన్నారు. అంతేకాకుండా 5 గ్రామ పంచాయతీలను ఆంధ్ర నుండి తెలంగాణకు తీసుకురావడంలో విఫలమైన ప్రభుత్వం ఎక్కడో ఒక చోట డంపింగ్ యార్డ్ నిర్మాణం చేయాలి కాబట్టి సుందరయ్య నగర్ ప్రాంతాన్న ఎంపిక చేసుకుందని అన్నారు. జనావాసాల మధ్య కాకుండా ప్రత్యామ్నాయ స్థలాన్ని ఇప్పటికైనా అధికారులు పరిశీలించాలని, డంపింగ్ యార్డ్ నిర్మాణంలో స్థానిక ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఏజే రమేష్, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం. బి. నరసారెడ్డి, పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి జిల్లా కమిటీ సభ్యులు ఎం రేణుక, సున్నం గంగ, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బండారు శరత్ బాబు వై వెంకట రామారావు, శాఖ కార్యదర్శి అన్నం లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed