- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ విషయం ఆందోళన కలిగించింది- గవర్నర్ తమిళసై
దిశ, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ మంగళవారం విస్తృతంగా పర్యటించారు. భద్రాచలం రాములవారి పట్టాభిషేకం అనంతరం అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న అనేక మారుమూల గ్రామాలను సందర్శించారు. అనంతరం కొత్తగూడెంలోని సింగరేణి గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతంలో పర్యటనలో గిరిజనులు ఎంతో ఆప్యాయంగా పలకరించారని అన్నారు. భద్రాచల దేవస్థానం ఆహ్వానం మేరకు సీతారామ పట్టాభిషేకం కార్యక్రమంకు రావడం సంతోషంగా ఉందని, దేవస్థాన ఆహ్వానం మేరకు వెళ్లిన తనకు ఊహించని రీతిలో సీతారాముల దర్శన భాగ్యం కలిగించినందుకు సంతోషం వ్యక్తం చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోండు గ్రామాల్లో చాలామంది గర్భిణీ మహిళలు పౌష్టికాహారం లోపంతో ఉండడం గమనించానని అన్నారు. చాలా మంది గర్భిణీ స్త్రీలకు బీపీ అత్యధిక స్థాయిలో ఉండడం ఆందోళన కలిగించిందని అన్నారు. గతంలో గర్భిణులకు పౌష్టికాహారం, వైద్య సదుపాయం కల్పించడం కోసం రాష్ట్రంలో 6 గ్రామాలను దత్తత తీసుకోవడం జరిగిందని తెలిపారు. గర్భిణీలు సరైన ఆహారం తీసుకోకపోవడం, ఎక్కువగా పచ్చళ్ళు తినడం వలన గిరిజన ప్రాంతాల్లో నివసించే గర్భిణీ స్త్రీలు అత్యధికంగా అనారోగ్య పాలవడం జరుగుతుందని తెలిపారు.
ప్రోటోకాల్ పై విలేకరులు అడిగిన ప్రశ్నకు
ప్రోటోకాల్ కంటే జనం నుంచి వచ్చే కాంప్లిమెంటరీ సంతోషాన్ని కలిగించిందని ఆనందం వ్యక్తం చేశారు. ఇకముందు కూడా గిరిజనుల సమస్యలపై రాజ్ భవన్ నుంచి దృష్టి పెట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు .