జమిలి ఎన్నికలు ప్రమాదకరం.. సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్

by Sumithra |
జమిలి ఎన్నికలు ప్రమాదకరం.. సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్
X

దిశ, ఖమ్మం టౌన్ : జనావాసాలకు దూరంగా ఉండవలసిన వివిధ కంపెనీల గ్యాస్ ఏజెన్సీ గోదాములు జనావాసాల మధ్యనే తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆవుల అశోక్ అన్నారు. ఆదివారం స్థానిక రామ నరసయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఖమ్మం నగర కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. అనేక గ్యాస్ కంపెనీలు జనావాసాల మధ్యనే ప్రమాణాలు పాటించకుండా నిర్వహిస్తున్నారని, గ్యాస్ సిలిండర్ల వ్యాపారం కొనసాగిస్తున్నా సివిల్ సప్లై అధికారులు స్పందించడం లేదని ఆయన అన్నారు. ప్రారంభంలో ఊరికి దూరంగా ఏర్పాటు చేసిన ఈ కంపెనీలు నగరం విస్తీర్ణంతో జనావాసాల మధ్యకు వచ్చాయని, నిబంధనల ప్రకారం జనావాసాల నుండి దూరంగా గ్యాస్ ఏజెన్సీలు తరలించాలని ఉన్నా కూడా అధికారులు గాలికి వదిలేశారని ఆయన అన్నారు. సరైన నిర్వహణ లేకపోతే అనుకోని ప్రమాదం జరిగితే వందలాది ప్రాణాలు గాల్లో కలిసి పోతే దానికి బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. ఖమ్మం నగరంలో ఉన్న అన్ని గ్యాస్ ఏజెన్సీ గోదాములను ఊరు వెలుపలకు తరలించాలని ఆయన డిమాండ్ చేశారు.

గ్యాస్ సిలిండర్లకు అదనంగా వసూలు చేయటం ప్రభుత్వం కేటాయించిన దానికంటే వెయిట్ తక్కువగా ఉంటున్న గ్యాస్ బండలు అనేకం ప్రజలకు సరఫరా అవుతున్నాయని ఆయన అన్నారు. గ్యాస్ ఏజెన్సీల అక్రమాల పై సివిల్ సప్లై అధికారులు స్పందించాలని ఆయన కోరారు. తక్షణమే గ్యాస్ గోడౌన్ నగర వెలుపలకు తరలించాలని కోరారు. ఫెడరల్ వ్యవస్థకు ఖూనీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ కేంద్రీకృత పాలనకు ఉపయోగించుకోవటం కోసమే జమిలి ఎన్నికలు తీసుకొస్తున్నారని అన్నారు. ఈ విధానం పై పెద్ద ఎత్తున ప్రజలు, ప్రజాస్వామ్య వాదులు ఉద్యమించాలని ఆయన కోరారు. రాష్ట్రాల హక్కుల పై కేంద్రం పెత్తనం చేయాలని చూస్తుందన్నారు. పాసిస్ట్ ప్రమాదం దేశానికి పొంచి ఉన్న నేపథ్యంలో దానికి వ్యతిరేకంగా ప్రజలు ప్రజాస్వామ్య వాదులు పెద్ద ఎత్తున ఉద్యమించాలని, కేంద్రం చేసే కుట్రలను అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ డివిజన్ కార్యదర్శి ఝాన్సీ నాయకులు కే.శ్రీనివాస్, మల్లెపల్లి వెంకటేశ్వర్లు, భరత్, చిలకల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed