Fever Fear: అమ్మో జ్వరం.. మంచానికే పరిమితమైన ఆ మండలం

by Kavitha |
Fever Fear: అమ్మో జ్వరం.. మంచానికే పరిమితమైన ఆ మండలం
X

దిశ,తల్లాడ: ప్రస్తుతం వర్షాకాల స్టార్ట్ అయింది కాబట్టి ఎవరి నోట విన్నా జ్వరం వచ్చింది అనే మాటే వినిపిస్తోంది. కానీ, ఖమ్మం జిల్లా, తల్లాడ అనే మండలం మాత్రం వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఎందుకంటే ఆ మండలం మొత్తం ఏ ఇంట చూసినా ఇద్దరు ముగ్గురు వ్యక్తులు మంచంలోనే ఉండి జ్వరాలు కీళ్ల నొప్పులు అంటూ చేతికి సెలూన్ బాటిల్తో బాధపడుతున్నారు. ఇంకా ఇది సరిపోనట్టు దీనికి తోడు డెంగ్యూ, మలేరియా, టైపాడ్, ఫ్లూ జ్వరాలు వంటివి విజృంభిస్తున్నాయి. దాదాపు ఒకేలాంటి లక్షణాలు కలిగి ఉండటం వల్ల ఏది ఏ జ్వరమో తెలుసుకోలేని గందరగోళంలో వైద్యులకు సవాలుగా మిగిలింది.

అయితే ఈ లక్షణాలు ఉన్న ప్రజలకు జ్వరం 102 డిగ్రీల తీవ్రతతో పాటు కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు అనేవి మూడు వారాల నుంచి నెల రోజుల పాటు ఉంటాయని వైద్యులు తెలుపుతున్నారు. ఇది ఎక్కువగా దోమల బెడద వల్ల, కండరాల నొప్పితో బాధపడుతూ చేతికి కర్ర సహాయంతో నడిచే దుస్థితి ప్రజలకు పడుతుందని, అలాగే ప్లేట్లెట్స్ తీవ్రంగా తగ్గి మరింత అనారోగ్యానికి గురి కావడానికి కారణం అవుతుందని డాక్టర్లు సూచిస్తున్నారు.

*తల్లాడ వైద్యాధికారి డాక్టర్ రత్న మనోహర్ వివరణ..

డాక్టర్ మనోహర్ మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులు వాతావరణ మార్పుల వల్ల సంభవిస్తున్నాయని తెలిపారు. అందులో భాగంగానే తల్లాడ మండలంలో జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉన్నాయని దీనితో పాటు కండరాల నొప్పితో కూడా చాలా మంది బాధపడుతున్నారని వెల్లడించారు. అయితే ఈ తీవ్రత ఎక్కువగా చికెన్ గున్యా, డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వంటి జ్వరాలు వస్తున్న వారిలో ఎక్కువగా వస్తున్నాయి. వీటికి చికిత్స జ్వరం దగ్గు మామూలుగా ఉండే పారాసెటమాల్ దగ్గు మందులతోనే ఉపశమనం లభిస్తుంది. ఈ జ్వరం వచ్చిన వాళ్లకు ఒళ్ళు నొప్పులు రెండు మూడు రోజుల తర్వాత వాటంతటవే తగ్గుతాయని, ప్లేట్లెట్స్ సంఖ్య తెలుసు కోవడానికి తరచూ రక్త పరీక్షలు చేస్తూ వీరిని జాగ్రత్తగా కనిపెట్టుకోవాల్సి ఉంటుంది అని డాక్టర్ సూచించారు. అదేవిధంగా నోటితో ద్రవాలు తీసుకోలేక పోతున్న, రక్తంలో హిమోగ్లోబిన్ శాతం ఎక్కువ ఉన్న, రక్తపోటు బాగా పడిపోయినా, సెలైన్ ఎక్కించాల్సి ఉంటుంది. అయితే ఇది ముఖ్యంగా ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం దోమల బెడద ఎక్కువగా ఉండటం ఈ జ్వరానికి ముఖ్యమైన కారణం. ఇక అందులోనూ దోమలు పట్టపగలే ఒక వ్యక్తిని కుట్టిన వెంటనే మనిషి యొక్క అవయవాలను దెబ్బ తినడం సంభవిస్తాయి. దీంతో మనిషి శరీర ఉష్ణోగ్రత 101 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉండి జ్వరం సంభవిస్తుంది. కాబట్టి దీనికి మెరుగైన చికిత్స తీసుకోవడంతో పాటు తగిన జాగ్రత్తలు పాటించడం మంచిది.

*పైసలు లేక పాకింగ్ బంద్.. బిజెపి మండల అధ్యక్షుడు ఆపతి వెంకట రామారావు..

ప్రభుత్వం పంచాయతీలకు పైసా విధుల బాట లేదు. దీంతో ఎక్కడ చెత్త అక్కడే ఉంటుంది దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. ప్రజలు ఆసుపత్రి బాట పడుతున్నారు. నిధులు లేక కనీసం పాకింగ్ కూడా చేయలేక కార్యదర్శిలు ప్రత్యేక అధికారులు చేతులెత్తేశారు. నిధులు లేక అష్ట కష్టాలు మండలంలో 19 గ్రామ పంచాయతీలకు కార్యదర్శులు స్పెషల్ ఆఫీసర్లు ఉన్నారు. నిధులు అందించకపోవడంతో స్పెషల్ ఆఫీసర్లు పంచాయతీల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇప్పటివరకు చాలా మంది పంచాయతీ కార్యదర్శులు అప్పులు తెచ్చి నెట్టుకొచ్చిన కొంతమంది కార్యదర్శులు బదిలీ అయ్యి వెళ్లారు. మిగిలిన కార్యదర్శులు కొత్తగా చేయాల్సిన వారు కూడా మొహం చాటేస్తున్నారు. ఇదేమిటని ప్రజలు అడుగుతారేమో అని కార్యదర్శులు బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు.

*పంచాయతీలపై నిర్లక్ష్యం తగదు.. రుద్రాక్ష బ్రహ్మం మాజీ ఎంపీటీసీ..

పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా పనులు ఎలా చేస్తారు. వానలో ప్రారంభమైనాయి. కొత్తనీరు రాకతో వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకొని.. ప్రభుత్వం పంచాయతీలకు నిధులు కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది..

Advertisement

Next Story