తుమ్మల నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి..!బుజ్జగింపులకు దిగిన బీఆర్ఎస్ అధిష్టానం

by Hamsa |   ( Updated:2023-08-24 03:29:50.0  )
తుమ్మల నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి..!బుజ్జగింపులకు దిగిన బీఆర్ఎస్ అధిష్టానం
X

దిశ, ఖమ్మం రూరల్​ : పాలేరు టికెట్ తనకే వస్తుందని భావించిన మాజీ మంత్రి తుమ్మలకు భంగపాటు తప్పలేదు. 2018లో కాంగ్రెస్​ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కందాళకే అధిష్టానం టికెట్ కట్టబెట్టడంతో తుమ్మల అభిమానులు అగ్రహంతో ఉన్నారు. అదిష్టానం తుమ్మలకు మొండిచేయి చూపడంతో ఎట్టి పరిస్థితుల్లో పాలేరు బరిలో ఉండాలని అభిమానులు ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. విలువ లేని చోట ఉండే ప్రసక్తిలేదని, సీఎం కేసీఆర్‌కు తమ సత్తా ఏంటో చూపాలని సూచిస్తున్నారు.

మోజార్టీ నాయకులు కాంగ్రెస్​నుంచి బరిలో నిలవాలని, అలా చేస్తే సీపీఐ, సీపీఎం ఓట్లు కలిసివచ్చే అవకాశం ఉందని చెబుతున్నట్లు సమాచారం. మరోవైపు తుమ్మలను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదని పార్టీ పెద్దలు బుజ్జిగించే ప్రయత్నాలు చేస్తున్నారు. బుధవారం ఎంపీ నామా, మరో ఎమ్మెల్యే తుమ్మల ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. కానీ తుమ్మల సీఎంతో మాట్లాడేందుకు అయిష్టత వ్యక్తి చేసినట్లు సమాచారం. టికెట్ ఇవ్వకుండా బుజ్జిగించేందుకు తానేమీ చిన్నపిల్లడిని కాదని, రాజకీయాలు తనకూ తెలుసునని వచ్చిన నాయకులకు తెగేసిచెప్పినట్లు తెలిసింది.

అనుచరుల సమావేశాలు

పాలేరు నుంచి తుమ్మలకు సీటు రాకపోవడంతో పాలేరు నియోజకవర్గం నుంచి తుమ్మల అభిమానులు, వర్గీయులు రూరల్​మండలం టీసీవీరెడ్డి ఫంక్షన్​హల్‌లో సమావేశమయ్యారు. అదిష్టానం గుర్తించకపోయినంత మాత్రన నష్టమేమీ లేదని మనదారి మనం చూసుకోవాలని పాలేరులో తమ సత్తాచాటాలని మెజార్టీ నాయకులు అభిప్రాయపడినట్లు తెలిసింది. ఇది ఇలా ఉండగా బుధవారం సత్తుపల్లి, వైరాలో తుమ్మల వర్గీయులు సమావేశమై భవిష్యత్తు కార్యచరణ పై చర్చ జరిగింది. తుమ్మల అభిమానుల పేరిట ఆత్మీయ సమావేశం అంటూ కేసీఆర్, కేటీఆర్ ఫోటో లేకుండానే ఏర్పాటు చేసి సమావేశం నిర్వహించారు. నేడు ఇల్లందు, ఆశ్వారారావుపేటలో సైతం తుమ్మల వర్గీయులు సమావేశమై ఓ నిర్ణయం తీసుకొనన్నట్లు విశ్వసనీయ సమాచారం.

పోటీలో ఉండాల్సిందే..

తమకు విలువ లేని చోట ఉండే ప్రసక్తిలేదని, పాలేరులో నిలబడి సత్తాను సీఎం కేసీఆర్​కు చాటాలని కసితో ఉన్నారు. సమావేశాల్లో సైతం మోజార్టీ నాయకులు కాంగ్రెస్​ నుంచి పాలేరు బరిలో నిలవాలని తుమ్మల ఆలోచన చేయాలని నాయకులు ఒత్తిడి చెస్తున్నట్లు తెలిసింది. పాలేరు నుంచి పోటీ చేస్తే అన్ని పార్టీ ఓట్లు ముఖ్యంగా సీపీఐ, సీపీఎం ఓట్లు కూడ కలిసివచ్చే అవకాశం ఉందని నాయకులు అభిప్రాయం ఆ దిశగా నాయకల పావులు కదుపుతన్నట్లు సమాచారం. ఎది ఎమైనా పాలేరు నుంచి తుమ్మల బరిలో నిలిస్తే పోటీ రసవత్తరంగా ఉండనుంది.

బుజ్జగించే యత్నాలు

తుమ్మలను పార్టీ లైన్​దాటకుండా ఉంచేందుకు అదిష్టానం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. వరుస భేటీలతో తుమ్మలను బుజ్జగించేందుకు ప్రయత్నం చేస్తున్నా.. తుమ్మల మాత్రం ఎ మాత్రం అవకాశం ఇవ్వడం లేదని తెలిసింది. రాజకీయాలు తనకు కొత్తకాదని, ఏం చేయాలో తెలుసునని వచ్చిన దూతలకు స్పష్టంగా చెప్పినట్లు తెలిసింది. కానీ నామాతో మాత్రం రెండు గంటల పాటు చర్చలు జరిపినట్లు తెలిసింది.

చర్చల్లో జరిగిన విషయాలు మాత్రం బయటకు రాలేదు. తుమ్మల పార్టీ మారితే జిల్లా మొత్తం ప్రభావం చూపనుందని, పాలేరు, ఖమ్మం, వైరా, సత్తుపల్లి, ఆశ్వారావుపేట, ఇల్లందు, కొత్తగూడెం నియోజకవర్గాల్లో తుమ్మల వర్గం బలంగానే ఉందని చెప్పాలి. అదిష్టానం మాటతో పార్టీ లైన్‌లో ఉంటారా..? లేదా భవిష్యత్ కార్యచరణ కోసం మరో నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి మరి.

Also Read: మోత్కుపల్లి అసమ్మతిగళం! నేడు యాదగిరిగుట్టలో అనుచరులతో సమావేశం?

Advertisement

Next Story