- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యువత వాటికి దూరంగా ఉండాలి.. పోలీస్ కమిషనర్
దిశ, ఖమ్మం టౌన్ : ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ ఆదేశాల మేరకు గంజాయి, మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా పోలీస్ శాఖ అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా ఖమ్మం నగరంలోని మూడవ పట్టణ ప్రాంతాల్లో సీఐ సర్వయ్య ఆధ్వర్యంలో శనివారం సిరి చైతన్య కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. ప్రస్తుతం యువత సిగరెట్, గంజాయి, మందు వంటి మాదక ద్రవ్యాల బారిన పడి నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు.
అందువల్ల యువత భవిష్యత్ దెబ్బతింటుదన్నారు. విద్యార్థి మంచిగా ఎదగాలన్నా, మంచిగా మెలగాలన్నా చుట్టూ ఉన్న వాతావరణం మంచిగా ఉండాలని సూచించారు. ప్రతి విద్యార్థి ఇంటర్ మిడియేట్ దశలోనే తమ భవిష్యత్‌ను చక్క దిద్దు కోవాలని కోరారు. విద్యార్థి దశలో మీ మీద ఎలాంటి కేసులు కాకుండా చూసుకుంటేనే మీరు మంచి ఉద్యోగాన్ని సాధించుకోవచ్చు అన్నారు. విద్యార్థులు ఇవి దృష్టిలో పెట్టుకుని మెలగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మూడవ పట్టణ పోలీస్ సిబ్బంది రాంబాబు, వెంకటేశ్వర్లు, కళాశాల ప్రిన్సిపాల్, లెక్చరర్లు పాల్గొన్నారు.