- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ పార్టీ రాకతో సంక్షేమ పథకాల్లో మార్పు
దిశ, ఖమ్మం : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల్లో మార్పులు చోటు చేసుకున్నాయని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. శుక్రవారం మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామంలోని బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు పెండ్యాల పుల్లయ్యపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేయడంతో ఆ కుటుంబాన్ని హరీష్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ...కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఇవ్వకుండా మార్పు తీసుకువచ్చారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఉత్సవాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి నెలా అక్కాచెల్లెళ్లకు రూ. 2500 ఇస్తామని చెప్పి 11 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఇవ్వలేదని, దాంతో వారికి ప్రభుత్వం రూ. 27,500 బాకీ పడ్డారని ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ హయాంలో ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకం అందించిందని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో కళ్యాణ లక్ష్మి పథకంతో పాటు తులం బంగారం ఇస్తామని మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఆరు లక్షల వరకు పెళ్లిళ్లు జరిగాయని, పెళ్లి చేసుకున్న ఆడబిడ్డలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు లక్షల తులాల బంగారం బాకీగా ఉందని విమర్శించారు. రైతులకు రుణమాఫీ చేయకుండా మోసం చేశారని తెలిపారు. ఆగస్టు 15వ తారీకు రైతులకు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద ప్రమాణం చేశారని గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి లేస్తే దేవుళ్ల పైన ప్రమాణం... లేకపోతే తిట్ల పురాణంతో రోజులు గడుపుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వాసుపత్రిలో సరైన వసతులు లేక రోగులు ఇబ్బందులు పట్టుకున్నారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే కేసీఆర్ కిట్టు ఇచ్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిచేయాలని అప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ వెంట పడుతుందని తెలిపారు. ఈ సభలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ లింగాల కమల్ రాజ్, ఎమ్మెల్సీ తాత మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.