ధాన్యం అమ్మిన 48 గంటల్లోనే రైతు ఖాతాలో నగదు జమ : ఎంపీ రఘురాం రెడ్డి

by Aamani |
ధాన్యం అమ్మిన 48 గంటల్లోనే రైతు ఖాతాలో నగదు జమ :   ఎంపీ రఘురాం రెడ్డి
X

దిశ, ఖమ్మం రూరల్ : ధాన్యం అమ్మిన 48 గంటల్లోనే రైతు ఖాతాలో నగదు తెలంగాణ ప్రభుత్వం జమ చేస్తుందని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి అన్నారు. రైతులు తాము పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని తెలిపారు. సోమవారం రూరల్ మండలం ఏదులాపురం సొసైటీ పరిధిలోని కాచిరాజు గూడెం గ్రామపంచాయతీ వాల్యా తండాలో ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి సోమవారం ప్రారంభించారు.

రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తో కలిసి ధాన్యం తేమ శాతాన్ని, కాంటాలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. కొనుగోలు వేగంగా నిర్వహించాలని అన్నారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ బైరు హరినాధ బాబు, కాంగ్రెస్ ఖమ్మం రూరల్ మండలాధ్యక్షులు కళ్లెం వెంకటరెడ్డి, కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్, నాయకులు నాగండ్ల శ్రీనివాసరావు, పలువురు ప్రజా ప్రతినిధులు, సాధిక్ అలీ కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed