- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Stock Market: వరుసగా ఏడో రోజూ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
దిశ,వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) సోమవారం నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడం, విదేశీ మదుపర్లు అమ్మకాలతో మన బెంచ్ మార్క్ సూచీలు తీవ్ర ఒడుదుడుకులను ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా ఈ రోజు ఐటీ స్టాక్స్(IT Stocks)లో ఇన్ఫోసిస్(Infosys), టీసీఎస్(TCS) షేర్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్(Sensex) ఉదయం 77,863.54 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలై కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో 76,965.06 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకిన సెన్సెక్స్ చివరికి 241.30 పాయింట్ల నష్టంతో 77,339 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ(Nifty) 78.90 పాయింట్లు తగ్గి 23,453 వద్ద ముగిసింది. గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 71.67 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.40 దగ్గర ముగిసింది.
లాభాలో ముగిసిన షేర్లు : ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్
నష్టపోయిన షేర్లు : టాటా స్టీల్, హిందుస్థాన్ యూనీలీవర్, నెస్లే ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా