నేనో యువకున్ని.. కానీ పురుషుణ్ణి చూస్తే నాలో లైంగిక వాంఛ పెరిగి.. అలా చేస్తా!

by Bhoopathi Nagaiah |
నేనో యువకున్ని.. కానీ పురుషుణ్ణి చూస్తే నాలో లైంగిక వాంఛ పెరిగి.. అలా చేస్తా!
X

డాక్టర్.. నేనొక నిరుపేద యువకున్ని. గవర్నమెంటు కాలేజీలో డిగ్రీ చదివి గ్రూప్స్‌కి ప్రిపేర్ అవుతున్నాను. ఇప్పుడు 21 సంవత్సరాలు. నాకు 14 ఏళ్లప్పటినుంచీ, నేనొక వింత సమస్యతో బాధ పడుతున్నాను. క్లీన్‌గా షేవ్ చేసుకునే 50 సంవత్సరాల పురుషుణ్ణి చూస్తే నాలో లైంగిక వాంఛ కలుగుతుంది. వాళ్లని ముట్టుకోవాలని, కౌగలించుకోవాలని, ముద్దుపెట్టుకోవాలని అనిపిస్తుంది. బస్సుల్లో ఒకటి, రెండుసార్లు అలా ప్రవర్తించి చెంప దెబ్బలు తిన్నాను. దీని వలన నేను మనశాంతి కోల్పోతున్నాను. ఈ అసహజమైన కోరికలు నన్ను భయానికి లోను చేస్తున్నాయి. దీనికి చికిత్స ఉంటే చెప్పగలరు. -రవికాంత్, కడప

నీది ఒక మనోలైంగిక సమస్య. దీని ములాలు వ్యక్తిత్వం రూపొందే, నీ బాల్య, కౌమార, యవ్వన దశల్లో వేతకాల్సి ఉంటుంది. ఈ దశలోనే మానవ లైంగిక దృక్పథాలు ఆరోగ్యకరమైనవో లేదా సహజమైనవో , వ్యతిరేకం లేదా అసహజం అయినవో తయారు అవుతాయి. నీ బాల్య జీవితంలోని ఈ పై వ్యక్తిత్వ పరిణామ దశల్లోని ఏ వ్యతిరేక, హానికరమైన బాధాకరమైన అవమానకరమైన, అనుభవాలు, గాయాలు ప్రస్తుత నీ యవ్వన కాలంలోని ఈ మనోలైంగిక సమస్యకి లేదా అసహజ లైంగిక ప్రవర్తనకు దారి తీసిందో తెలుసుకోవాలి. నీకు వెంటనే సైకోసెక్సుల్ కౌన్సిలింగ్, సైకో థెరపీ అవసరం . నీ అసహజ లైంగిక అశక్తులను, ప్రవర్తనలను తగ్గించే దిశగా ఈ మనోలైంగిక చికిత్స ఉంటుంది. మంచి సెక్సాలజిస్టును వెంటనే కలవు లేకపోతే నిన్ను నువ్వు నియంత్రించుకోలేని స్థితిలో మరిన్ని అవమానాలు పొందవలసి ఉంటుంది. ఈ సమస్య వాళ్ల అనేక మానసిక, శారీరిక, సామాజిక, కౌటుంబిక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నీకు స్త్రీని పెళ్లి చేసుకోవాలని కూడా అనిపించకపోవచ్చు. ఒక వేళ పెళ్లి చేసుకున్నా, పెళ్లి తరువాతి దాంపత్య జీవితంలో కూడా సెక్స్ సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. వైవాహిక జీవితం విఛ్చిన్నం కావచ్చు. వెంటనే చికిత్స తీసుకో.

- డాక్టర్ భారతి, MS

మేరిటల్ కౌన్సెలర్

సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్

Advertisement

Next Story

Most Viewed