Assembly : రైతు భరోసాపై నేడు అసెంబ్లీలో కీలక చర్చ

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-12-21 05:04:18.0  )
Assembly : రైతు భరోసాపై నేడు అసెంబ్లీలో కీలక చర్చ
X

దిశ, వెబ్ డెస్క్ : శీతకాల అసెంబ్లీ(Assembly)సమావేశాల చివరి రోజున ప్రభుత్వం రైతు భరోసా(Rythu Bharosa)పై విధాన పరమైన కీలక నిర్ణయం తీసుకునే దిశగా స్వల్పకాలిక చర్చ(Key debate)ను చేపట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు ఎకరాకు విడతకు రూ.5000 ఆర్థిక సహాయ పథకం స్థానంలో రైతు భరోసాను అమలు చేస్తామని ఎకరాకు రూ.7,500అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అయితే రైతుబంధు పథకంలో అనర్హులకు ఆర్ధిక సహాయం అందుతుందని, ప్రభుత్వ నిధులు దుర్వినియోగమవుతున్నాయన్న విమర్శల నేపథ్యంలో పథకం అమలులో మార్పులు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది.

దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ నియమించి ఉమ్మడి జిల్లాల వారిగా ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ నిర్వహించింది. రైతు భరోసాను 5లేదా 10ఎకరాలకు పరిమితం చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ రిటర్న్ దారులను, పెన్షన్ దారులను మినహాయించాలన్న సూచనలు కేబినెట్ సబ్ కమిటీకి అందాయి. అలాగే రైతు భరోసా సహాయాన్ని పంట కొనుగోలు సందర్భంగా బోనస్ గా అందించవచ్చన్న సూచనలు కూడా వచ్చాయి. దీంతో రైతు భరోసా విధివిధానాల ఖరారుపై ఏం చేయాలన్నదానిపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయించాలని ప్రభుత్వం భావించింది. నేడు అసెంబ్లీలో దీనిపై స్వల్పకాలిక చర్చ కొనసాగనుంది. సంక్రాంతి తర్వాత రైతు భరోసా చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో పథకం విధివిధానాల ఖరారుపై జరుగుతున్న నేటి చర్చ కీలకంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed