- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కన్నీరు ఏడ్చినప్పుడే ఎందుకు వస్తుంది? ..ఇదిగో షాకింగ్ నిజాలు !
దిశ, ఫీచర్స్: ఆనందం కలిగినా, బాధ కలిగినా ప్రతీ ఒక్కరికీ కన్నీరు వస్తుంది. మరికొన్ని సందర్భాల్లో షాక్‌తో కనీళ్లు వస్తాయి. ప్రతీ మనిషి ఏదో ఒక మానసిక స్థితిలో ఏడుస్తారు. ఈ టైమ్‌లో కన్నీళ్లు ఎందుకు వస్తాయి అనే విషయం గురించి ఎప్పుడైనా ఆలోచించారా..? కొన్ని సందర్భాల్లో సినిమాల చూస్తున్నప్పుడు భావోద్వేగ సన్నివేశాల కారణంగా ఎక్కువగా కన్నీరు వస్తుంది. ప్రయాణాలు చేస్తున్నప్పుడు ముఖానికి ఎక్కువగా గాలి తగిలిదే, కళ్ల నుంచి నీళ్లు వస్తాయి. ఇలా ప్రతీ చిన్న విషయానికి కన్నీళ్లు వస్తుంటాయి. అసలు కన్నీళ్లు ఎందుకు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా కన్నీళ్లు అనేవి మానసిక స్థితికి సంబంధించినవి. ఇవి మూడు రకాలుగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. మొదటిది బేసల్ వర్గం. రెండవది అకస్మాత్తుగా సంభవించే రిప్లెక్స్ అనే ఏడుపు. మూడవది భావోద్వేగ ప్రతిస్పందన కారణంగా వస్తుంటాయి. వీటిలో రిప్లెక్స్ అని పిలువబడే మరొక ఏడుపు ఉంది. ఇది నిజమైన ఏడుపు కాదు. అకస్మాత్తుగా కన్నీరు సంభవిస్తాయి. అంటే ఉల్లిపాయ లేదా దుమ్ము, అకస్మాత్తుగా నొప్పి కలిగిన్పపుడు ఈ రకమైన ఏడుపు వస్తుంది. నిజానికి మానవ మెదడులో ఒక లాక్రిమల్ గ్రంథి నుండి ఈ ఏడుపు ఉద్భవిస్తుంది. ఈ గ్రంథి ప్రోటీన్, శ్లేష్మం లేదా జిడ్డుగల ఉప్పు నీటిని ఉత్పత్తి చేస్తుంది.
ఇవి నీళ్ల రూపంలో కళ్ల ద్వారా బయటకు వస్తాయి. ఈ ద్రవాన్ని కన్నీళ్లు అంటారు. ఆనందంగా లేదా బాధ, నిరాశ కారణంగా శరీరంలో టాక్సిన్స్ లేదా హానికరమైన రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. వాటిని బయటకి పంపించేందుకు ఏడుపు అవసరం అవుతుంది. ఎండోక్రైన్ వ్యవస్థ ద్వారా సెరెబ్రమ్ నుండి హార్మోన్లు విడుదల అవుతాయి. ఈ హార్మోన్లు దు:ఖానికి కారణమైన హానికర పదార్థాలను కళ్ళ చుట్టూ ఉన్న ప్రాంతానికి తీసుకెళ్తాయి. ఇవే కన్నీటి రూపంలో బయటకు వస్తాయి.