Minister Anagani:‘పూర్తిస్థాయి సైకోగా మారిన జగన్’.. మంత్రి సెన్సేషనల్ కామెంట్స్!

by Jakkula Mamatha |   ( Updated:2024-12-19 11:52:47.0  )
Minister Anagani:‘పూర్తిస్థాయి సైకోగా మారిన జగన్’.. మంత్రి సెన్సేషనల్ కామెంట్స్!
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి(AP Goverment) ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను తట్టుకోలేక మాజీ సీఎం జగన్(Former CM Jagan) పూర్తి స్థాయి సైకోగా మారాడని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి(Minister of Revenue) అనగాని సత్యప్రసాద్(Satya Prasad) పేర్కొన్నారు. అందువల్లే ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు మాత్రమే అయినప్పటికీ ఎప్పుడూ లేనంత వ్యతిరేకత ఉందని పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును గౌరవించే సంస్కారం వైఎస్ జగన్‌లో(YS Jagan) లోపించిందని, తన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సింది పోయి ఓటమిని జీర్ణించుకోలేక ఊహాలోకంలో విహరిస్తున్నారని విమర్శించారు.

పార్టీని ఎలా రక్షించుకోవాలో తెలియని వైఎస్ జగన్ తనకు అలవాటైన అబద్దాలనే నమ్ముకున్నాడని విమర్శించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అప్పుల కుప్పగా మార్చగా.. చంద్రబాబు(CM Chandrababu) నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం(AP Government) రాష్ట్రానికి తిరిగి గాడిలో పెడుతోందని అన్నారు. ఒకవైపు ప్రగతికర విధానాలు చేపడుతూ ఆదాయ మార్గాలను పెంచుకుంటూనే మరోవైపు సంక్షేమానికి కూడా పెద్ద పీట వేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. రైతులకు గత వైసీపీ ప్రభుత్వం బకాయి పెట్టిన 1674 కోట్ల రూపాయలను కూటమి ప్రభుత్వం చెల్లించిందని చెప్పారు.

గత ప్రభుత్వంలో రైతులు ధాన్యం అమ్ముకోవడమే కష్టంగా ఉండేదని, అమ్మిన తర్వాత డబ్బులు రావడానికి వారాల తరబడి ఎదురు చూడాల్సి వచ్చిందని అన్నారు. తమ ప్రభుత్వంలో ధాన్యాన్ని కొన్న 24 గంటల్లోగా నిధులు రైతు ఖాతాల్లోకి చేరుతున్నాయని చెప్పారు. మొదటి సారిగా కౌలు రైతులకు ఈ క్రాపింగ్‌ను అమలు చేస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వంలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారని, విద్యార్థులకు 6వేల కోట్ల రూపాయలకు పైగా బకాయిలు పెట్టారని, వీటన్నింటినీ కూటమి ప్రభుత్వం తీర్చుతుందోంటూ చెప్పారు. గత ప్రభుత్వంలో సామన్యుల భూములకు రక్షణ లేకుండా పోయిందని, తమ అనుయాయులకు భూములను దోచి పెట్టేందుకు జగన్ రెడ్డి ఎప్పుడు లేనన్ని భూ వివాదాలు సృష్టించారని, వాటన్నింటినీ పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోంది అని చెప్పారు. ఇలా అన్ని రంగాల్లోనూ ప్రజలకు మేలు చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేకే మాజీ సీఎం జగన్ పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని మంత్రి అనగాని విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed