- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Akhilesh yadav: బాబా సాహెబ్, బాబాల మధ్య పోరు.. యూపీ బైపోల్స్‌పై అఖిలేష్ యాదవ్
దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఉప ఎన్నికలు (By polls) బాబాసాహెబ్ అంబేద్కర్‌ను నమ్మేవారికి, బాబాలను నమ్మేవారికి మధ్య జరుగుతున్న పోరు అని సమాజ్ వాదీ పార్టీ(sp) చీఫ్ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఎన్నికల్లో ఒకవైపు రాజ్యాంగాన్ని రక్షించే వారు బరిలో ఉంటే.. మరోవైపు దానిని నాశనం చేసేవారు ఉన్నారని విమర్శించారు. దేశంలో దళితులు, అల్ప సంఖ్యాక వర్గాల వారిని రాజ్యాంగమే రక్షిస్తుందన్నారు. ఈ వర్గాల ప్రజలంతా ఐక్యంగా ఉండాలని కోరారు. ఉప ఎన్నికల్లో ఎస్పీ విజయం సాధించడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. కాగా, ఉత్తరప్రదేశ్‌లోని 9 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 20న ఎన్నికలు జరగనున్నాయి. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న ఎస్పీ మాత్రమే అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. కాంగ్రెస్ ఎన్నికల బరిలోకి దిగకుండా ఎస్పీకే మద్దతిచ్చింది. దీంతో ఈ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.