- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి : ఎమ్మెల్యే కసిరెడ్డి
దిశ, ఆమనగల్లు ::- రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర, బోనస్ పొందాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. సోమవారం ఆమనగల్లు ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో కడ్తాల్ మండల కేంద్రంలో సింగల్ విండో సబ్ సెంటర్ లో పిఎసిఎస్ చైర్మన్ గంప వెంకటేష్ తో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సన్నాలతో పాటు దొడ్డు ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు. రైతులు దళారులకు ధాన్యం విక్రయించి నష్టపోవద్దని ఆయన సూచించారు.
జనవరి 1 నుంచి రేషన్ దుకాణాల్లో లబ్ధిదారులకు సన్నబియ్యాన్ని అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. కేంద్రాలకు వచ్చిన వరి ధాన్యం తేమ శాతం తనిఖీ చేయాలని ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. తూకము,తేమ కొలిచే యంత్రాలు,గన్ని బ్యాగులు, టార్పాలిన్లు,క్యాలిబర్ మీటర్లు తదితర పరికరాలు అవసరమైతే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు అయిళ్ల శ్రీనివాస్ గౌడ్,పిఎసిఎస్ వైస్ చైర్మన్ సత్యం, డైరెక్టర్లు వీరయ్య, వెంకటయ్య, సేవ్య, వెంకటేష్,నాయకులు ఎల్ఎన్ రెడ్డి, నర్సింహా, భాస్కర్ రెడ్డి, రాజేష్, శ్రీనివాస్ రెడ్డి, సీఈవో దేవేందర్, ఏవో శ్రీలత తదితరులు పాల్గొన్నారు.