మిషన్ భగీరథ పైప్​లైన్ లీక్..చేతికొచ్చిన పంట నష్టం

by Naveena |
మిషన్ భగీరథ పైప్​లైన్ లీక్..చేతికొచ్చిన పంట నష్టం
X

దిశ,దేవరకద్ర: మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ అయ్యి చేతికొచ్చిన వరి పంట నష్టపోయిన సంఘటన దేవరకద్ర మండల పరిధిలో చోటుచేసుకుంది. రైతు తెలిపిన వివరాల ప్రకారం..మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం,పెద్ద గోపులాపూర్ శివారులోని మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలకు త్రాగునీరు సరఫరా అయ్యే 1000డిఐ పైప్ లైన్ గత ఆరు నెలలుగా లీకేజి ఏర్పడి..నీళ్లు వృధాగా పోతుంది. దీంతో మూడు జిల్లాలకు తాగునీటి సమస్య ఏర్పడే అవకాశం ఉంది.పెద్ద గోపులాపూర్ గ్రామానికి చెందిన గొల్ల పెద్ద కృష్ణయ్య తనకున్న రెండు ఎకరాల పొలంలో వరి పంట వేశాడు. గత ఆరు నెలలుగా మిషన్ భగీరథ నీళ్లు లీకేజ్ అవుతున్నాయి. దీంతో చేతికొచ్చిన వరి పంట నీటిపాలైంది. నీళ్లు వరి పొలంలో నుంచి పారడంతో కోతకొచ్చిన వరి పొలాన్ని కోయడానికి వీలు కాకపోవడంతో..ఆ రైతు పంట నీటి పాలైంది. ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ.. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించిన పట్టించుకోవడంలేదని వాపోయాడు. ఇప్పటికైనా మిషన్ భగీరథ అధికారులు లీకేజీని సరిచేసి యాసంగి పంట వేసుకునేటట్లు చర్య తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా దిశ రిపోర్టర్ మిషన్ భగీరథ అధికారులను వివరణ కోరాడు. అధికారులు మాట్లాడుతూ.. లీకేజ్ ని సరిచేసి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed