Trending : వర్క్‌ఫోర్స్.. నయా ట్రెండ్.. New Situation Ship క్రియేట్ చేస్తున్న Gen Z!

by Javid Pasha |
Trending : వర్క్‌ఫోర్స్.. నయా ట్రెండ్.. New Situation Ship క్రియేట్ చేస్తున్న Gen Z!
X

దిశ, ఫీచర్స్ : న్యూ సిచువేషన్ షిప్.. ఇటీవల యువతలో తరచుగా వినిపిస్తున్న మాట ఇది. ముఖ్యంగా కార్పొరేట్ సెక్టార్‌లో ట్రెండీ వర్డ్‌గా మారిపోయింది. నలుగురు ఎంప్లాయీస్ ఒక దగ్గర గుమిగూడితే వర్క్ ప్లేస్‌లో తాము ఫేస్ చేసిన సిచువేషన్స్ గురించి, క్రియేట్ చేసిన సిచువేషన్స్ గురించి డిస్కస్ చేసుకోవడం సహజమే. కానీ న్యూ సిచువేషన్ షిప్ (New Situation Ship) అందుకు భిన్నం అంటున్నారు నిపుణులు. ప్రస్తుతం అత్యధిక మంది యువతీ యువకులు దీనిని ఫాలో అవుతూ కెరీర్‌లో దూసుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంతకీ ఈ కొత్త రకం పరిస్థితి ఏమిటి? దానివల్ల యూత్‌కు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కాలంతోపాటు మారుతుంటాయని నిపుణులు చెబుతుంటారు. ఇప్పుడదే జరుగుతోంది. ఒకప్పటితో పోలిస్తే జనరేషన్ జెడ్ (Generation Z) ఆలోచనలు మారుతున్నాయి. అవి అనుభవజ్ఞులైన పెద్దలకంటే కాస్త భిన్నంగానూ ఉంటున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. కాస్త దూకుడుగా అనిపించినప్పటికీ ఈతరం యువతీ యువకులు తమ పర్సనల్ లైఫ్‌తో పాటు వర్క్ ప్లేస్ వాతావరణంలోనూ సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అవుతోందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ప్రధానంగా వర్క్‌పై ఫోకస్ చేయడం, ఎంప్లాయీస్ రికగ్నేషన్ ప్రోగ్రామ్స్‌ను సెట్ చేయడం, మేనేజ్ చేయడం వంటివి ఇందులో భాగంగా ఉంటున్నాయి. అట్లనే ఓల్డ్ అండ్ న్యూ జనరేషన్ మధ్య ఇన్ఫర్మేషన్ గ్యాప్ లేదా జనరేషన్‌గ్యాప్ వల్ల ఏర్పడే సమస్యలను కూడా క్లియర్ చేసుకోవడంలో ఈతరం సక్సెస్ అవుతోంది.

కెరీర్‌పై ఇంట్రెస్ట్.. వర్క్‌పై ఫోకస్

అప్పుడప్పుడూ పట్టాలు చేతబట్టుకొని వర్క్ ఫోర్స్‌లోకి అడుగు పెట్టే యువతరానికి అవకాశాలు కల్పించడంలో కొన్ని సంస్థలు అనాసక్తి చూపుతుంటాయి. ఎందుకంటే వీరికి వర్క్ ప్రయారిటీస్ తెలియవని, అనుభవం ఉండదని భావిస్తుంటాయి. ఇలాంటి వారిని ఉద్యోగంలోకి తీసుకుంటే ప్రొడక్టివిటీ తగ్గుతుందని అనుకుంటాయి. కానీ ఇదంతా గతం. ఇప్పుడు రిక్రూట్‌మెంట్ యాజమాన్యాలు ఆలోచనలు కూడా మారుతున్నాయ్. అనుభవం, ఆసక్తి, వర్క్ ప్రయారిటీస్ ముఖ్యమే అయినప్పటికీ ఫ్రెషర్స్ వల్ల ప్రొడక్టివిటీపై ఎఫెక్ట్ పడుతుందని ఎవరూ అనుకోవడం లేదట. ఎందుకంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో స్కిల్స్ కేవలం కొందరికో, ఎక్కువ అనుభవం ఉన్నవారికో మాత్రమే ఉంటాయని అనుకోవాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. అలవర్చుకుంటే అందరిలో ఉంటాయని చెబుతున్నారు. ఇది ఫాలో అయి అమలు చేయడాన్నే న్యూ ‘సిచువేష్ షిప్’ అంటున్నారు.

వ్యక్తిగత అభివృద్ధికి దోహదం

ఈ జనరేషన్ ముందుగానే తగిన స్కిల్స్ నేర్చుకొని వర్క్ ఫోర్స్‌లోకి అడుగు పెట్టి సత్తా చాటుతోంది. అంటే ఈ న్యూ సిచువేషన్ షిప్ ఆయా సంస్థలకు ఎంతో మేలు చేస్తోంది. ఫలితంగా ఒకప్పటి లెక్క అప్రెంటిస్ ట్రైనింగ్‌లకు నెలలు, సంవత్సరాల తరబడి సమయం కేటాయించాల్సిన అవసరం కూడా ఇప్పుడు లేదు. పైగా వర్క్ ప్రయారిటీని అర్థం చేసుకోవడంలో, దానికి తగిన వాల్యూ, సమయం ఇస్తూ ప్రొడక్టివిటీని పెంచడంలో ఈతరం ముందుంటున్న పరిస్థితి నేడు అనేక రంగాల్లో కనిపిస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. మేనేజ్‌మెంట్ డిస్కషన్‌లో పక్షపాతాన్ని తగ్గించడంపై ఫోకస్ పెట్టిన థాట్ ఎక్స్‌ఛేంజ్-2022 రిపోర్ట్‌ను మరోసారి విశ్లేషించిన నిపుణులు కూడా ఇదే చెబుతున్నారు. వర్క్ ఫోర్స్‌లోకి ఎంట్రీ ఇస్తు్న్న యూత్‌లో 96 శాతం మంది తమ వర్క్‌ను చాలా విలువైనదిగా భావిస్తున్నారు. కొత్తగా ఆలోచించడం, కొత్త దనాన్ని చేర్చడంలో సక్సెస్ అవుతున్నారు. ఇక 79 శాతం మంది తమ పర్సనల్ గ్రోత్‌ అండ్ ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్‌కు ఈక్వల్ ప్రయారిటీ ఇస్తున్నారు. దీంతో వర్క్ అండ్ లైఫ్ బ్యాలెన్స్‌తో, పాజిటివ్ ఆలోచనలతో కెరీర్‌లో దూసుకుపోతున్నారు.

జనరేషన్ గ్యాప్.. నో ప్రాబ్లం!

అది ఏ సెక్టార్ అయినా సరే.. సీనియర్లతో పోల్చినప్పుడు ఈ జనరేషన్‌లో అవగాహన, నైపుణ్యం తక్కువగా ఉంటుందని అందరూ భావిస్తారు. కానీ గతంలో పోల్చితే ఈ సిచ్యువేషన్‌షిప్‌లో మార్పు వచ్చిందంటున్నారు పర్సనల్ స్కిల్స్ నిపుణులు. ఎందుకంటే ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ సోర్స్ పెరిగిపోతున్నాయి. కాబట్టి ఇంటర్నెట్ యుగంలో నాలెడ్జ్, విషయ పరిజ్ఞానం ఎవరికో కొందరికే ఆపాదించడం లేదా అలా ఉంటుందని భావించడం కరెక్ట్ కాదంటున్నారు నిపుణులు. నేడు అనేకమంది యువతీ యువకులు వర్క్ ఫోర్స్‌లోకి వచ్చేటప్పటికే తగిన అవగాహనతో ఉంటున్నవారు చాలామందే ఉంటున్నారు. పైగా వర్క్ ప్లేస్‌లో తమ సీనియర్లతో కలిసిపోవడంలో, వర్క్ ప్రొడక్టివిటీని పెంచడంలో కీ రోల్ పోషిస్తున్నారు. వర్క్, లైఫ్, ప్రొడక్టివిటీ, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ గ్రోత్ ప్రయారిటీస్‌ను గుర్తించి న్యూ సిచువేషన్ షిప్‌ను క్రియేట్ చేస్తోంది ఈ జనరేషన్.

Advertisement

Next Story