- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా వయసు 27.. నా శరీరంలో మార్పులు వల్ల పెళ్లి చేసుకోవాలంటే భయంగా ఉంది
డాక్టర్.. నా వయసు 27 సంవత్సరాలు. రెండేళ్ల నుంచీ నా శరీరంలో కొన్ని మార్పులు జరుగుతున్నాయి. చర్మం మీద వెంట్రుకలు పల్చబడిపోయి, తలమీద, జననాంగాల దగ్గర నుంచి వెంట్రుకలు రాలిపోతున్నాయి. గొంతు వద్ద కొద్దీ వాపు, పొట్ట ఉబ్బి పెరిగింది. లావు కూడా అయ్యాను. ముఖం గుండ్రంగా మారింది. తరచూ తలనొప్పి, ఒళ్లు నొప్పులు, ఆయాసం వస్తున్నాయి. చర్మం ఎండిపోయి కళ్లకింద నల్లటి మచ్చలు వస్తున్నాయి. ఉద్రేకం, చిరాకు, కోపం ఎక్కువ అవుతున్నాయి. చాలా నీరసంగా, ఒక్కసారిగా శక్తి కోల్పోయినట్లు అనిపిస్తుంది. నన్ను చాలా భయానికి గురిచేస్తున్న విషయం ఏమిటంటే రెండేళ్ల నుంచి జననాంగంలో రక్త ప్రససరణ సరిగా లేదని అనుమానంగా ఉంది. మునుపటంత సెక్స్ కోరికలు లేవు. నాకు పెళ్లి చేసుకోవాలంటే భయంగా ఉంది. నన్నేం చేయమంటారు? -విశాల్, నల్లగొండ
మీ లక్షణాలు అన్నీ కూడా హైపో థైరాయిడ్ (Hypothyroidism) సమస్యను సూచిస్తున్నాయి. మీరోసారి ఎండోక్రైనాలజిస్ట్(Endocrinologist)ని కలవాలి. థైరాయిడ్ (Thyroid)ప్రొఫైల్ తో పాటుగా మీరు సెక్స్(Sex)లో సమస్య ఉందంటున్నారు కాబట్టి, ఆర్.బీ.ఎస్, సి.బీ.పీ, ఎల్.ఎఫ్.టీ, రీనల్ ప్రొఫైల్, లిపిడ్ ప్రొఫైల్, ఈ .సి. జీ, ఆండ్రోజెన్ ప్రొఫైల్ (ed ప్రొఫైల్, సెక్స్ హార్మోన్ లెవెల్స్)లాంటి టెస్ట్స్ చేయించాల్సి ఉంటుంది. థైరాయిడ్ ప్రొఫైల్‌తో మీకు థైరాయిడ్ ప్రాబ్లం ఉందో లేదో తెలిసిపోతుంది. ఉంటే మందులు జీవితాంతము వాడాల్సి ఉంటుంది. ఒకసారి మందులు మొదలు పెడితే మీ లక్షణాలు తగ్గుతాయి. ఇక థైరాయిడ్ సమస్యకి, సెక్స్ సమస్యకి సంబంధముంది. మీరు ఎండోక్రైనాలజిస్ట్‌ని కలిసి, ఆ తరువాత సెక్స్ సమస్యకు యూరో-ఆండ్రాలాజిస్ట్(Euro-Andrologist)ని, సెక్సాలజిస్టుని ఆలస్యం చేయకుండా కలవండి.
- డాక్టర్ భారతి, MS
మేరిటల్ కౌన్సెలర్
సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్