- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పచ్చన్ని చెట్లను నరుకుతున్న అక్రమార్కులు.. పట్టించుకోని అధికారులు..
దిశ, లింగాల : హరితహారంలో భాగంగా చెట్లను నాటే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టినప్పటికీ కొందరు అక్రమార్కులు పచ్చని చెట్లను ధ్వంసం చేస్తున్నారు. ముఖ్యంగా నాగర్ కర్నూల్ జిల్లాలోని లింగాల మండలం పరిధిలో ఇటీవల ఇటుక బట్టీలు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. ఇటుక బట్టీలు కాల్చేందుకు ఉపయోగించడానికి చెట్లను నరుకుతూ సొమ్ము చేసుకుంటున్నారు. చెట్లను నరకాలంటే ఫారెస్ట్ అధికారుల, వాల్ట చట్టం తహశీల్దార్ అనుమతి తీసుకోవాలి. కానీ ఈ ప్రాంతంలో దళారులు రహదారి పక్కనే ఉన్న చెట్లను నరుకుతున్నప్పటికీ ఫారెస్ట్ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రతి ఇటుక బట్టీల నుంచి ఫారెస్ట్ అధికారులకు మామూలు ముడుతునట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చెట్లను నరికే అక్రమార్కుల పై దృష్టి సారించి చెట్లను కాపాడవలసిన బాధ్యత ఎంతైనా ఉన్నదని ప్రజలు కోరుతున్నారు.