- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kota: కోటాలో మరో నీట్ విద్యార్థి ఆత్మహత్య..!
దిశ, నేషనల్ బ్యూరో: రాజస్థాన్‌లోని కోటా (Kota)లో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఏడాది ఇది 13వ మరణం కావడం గమనార్హం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్ (Bihar)లోని వైశాలి జిల్లాకు చెందిన 16 ఏళ్ల బాలుడు కోటాలోనీట్ కోచింగ్ తీసుకుంటున్నాడు. అతను దాదాబరీ ప్రాంతంలోని చోటా చౌరాహిన్ లోని హాస్టల్ లో నివసిస్తున్నాడు. అక్కడ మరికొందరు కోచింగ్ విద్యార్థులు కూడా నివసిస్తున్నారని ఆయన చెప్పారు ఈ క్రమంలోనే హాస్టల్ గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని అధికారులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం 1 గంటల సమయంలో ఎంత తలుపు తట్టినా డోర్ తెరవకపోవడంతో ఇతర విద్యార్థులు తమకు సమాచారమందిచినట్లు పోలీసులు తెలిపారు. డోర్ పగలగొట్టి చూడగా.. విద్యార్థి డెడ్ బాడీని గుర్తించామన్నారు. బుధవారం ఎప్పుడో సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
ఈఏడాది 13వ సూసైడ్
బాలుడు గత రెండేళ్లుగా కోటాలో మెడికల్ కాలేజీ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్నాడని, కోచింగ్ తీసుకుంటున్నాడని దాదాబరి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నరేష్ కుమార్ మీనా తెలిపారు. ఆత్మహత్యపై బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించామన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంబీఎస్ ఆస్పత్రికి డెడ్ బాడీని తరలించామన్నారు. తల్లిదండ్రులు వచ్చిన తర్వాత పోస్ట్‌మార్టం నిర్వహిస్తామని తెలిపారు. వివిధ పోటీపరీక్షల కోచింగ్ సెంటర్లకు ప్రసిద్ధి చెందిన కోటాలో విద్యార్థులు ఒత్తిడి కారణంగానే బలవన్మరణాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 13 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఈ సంఖ్య గతేడాది 26గా ఉంది. అయితే ఈ ఆత్మహత్యలు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాజస్థాన్ ప్రభుత్వం చాలాసార్లు పేర్కొంది. విద్యార్థుల కోసం హెల్ప్‌లైన్ నంబర్లు అందుబాటులో ఉంచింది. అయినా సూసైడ్ లు తగ్గకపోవడం గమనార్హం.