Sangareddy: పటాన్ చెరులో భారీగా డ్రగ్స్ పట్టివేత..

by Ramesh Goud |
Sangareddy: పటాన్ చెరులో భారీగా డ్రగ్స్ పట్టివేత..
X

దిశ, వెబ్ డెస్క్: పటాన్ చెరు(Patancheru)లో భారీగా డ్రగ్స్(Drugs) పట్టుబడ్డాయి. దాదాపు మూడు కోట్ల విలువ చేసే డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా(Sangareddy District)లో ఓ ముఠా గుట్టుగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో టీజీ న్యాబ్(TGNAB), సంగారెడ్డి పోలీసుల(Sangaredyy Police) జాయింట్ ఆపరేషన్(Joint Operation) నిర్వహించి పటాన్ చెరులో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి మూడు కోట్ల విలువ గల ఎండీఎంఏ(MDMA) డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా లెస్బియన్, హోయో సెక్సువల్ వ్యక్తులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం డ్రగ్స్ ముఠా సభ్యులను పోలీసుల అరెస్ట్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ ముఠా ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేశారు. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అనే దానిపై ధర్యాప్తు చేయనున్నారు.

Advertisement

Next Story

Most Viewed