K A Paul: కేఏ పాల్ అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్.. తగ్గేదే లే! ప్రెస్‌మీట్లో కీలక వ్యాఖ్యలు

by Ramesh N |
K A Paul: కేఏ పాల్ అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్.. తగ్గేదే లే! ప్రెస్‌మీట్లో కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేఏ పాల్ అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్.. తగ్గేదే లే.. అంటున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ (K. A. Paul). ఇవాళ నల్గొండ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రజాశాంతి పార్టీలో చేరాలని సూచించారు. (Komatireddy Brothers) కోమటిరెడ్డి బ్రదర్స్ రేవంత్ కన్నా వెయ్యి రెట్లు బలం కలిగిన సీనియర్ కాంగ్రెస్(Congress) నాయకులని చెప్పుకొచ్చారు. కానీ ఇంత బలం ఉన్నా గాని నల్లగొండ జిల్లాకు వీరు చేసిందేమీ లేదు.. అభివృద్ధి మాత్రం జీరో అని విమర్శించారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి సొంత జిల్లాలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని విమర్శించారు. దేవరకొండ నుంచి నల్లగొండ రోడ్డు మార్గం ప్రయాణం చేస్తే చాలు వీరి పాలన ఎలా ఉందో తెలిసి పోతుందన్నారు. నల్లగొండ దత్తత తీసుకుంటా అన్న కేసీఆర్ కనుమరుగైపోయాడన్నారు.

బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ (KTR) తప్పులు చేస్తే అరెస్టు చేయండి.. కానీ రాజకీయ కక్షతో కాదన్నారు. రాష్ట్రంలో వేల కోట్లు భూములు దోచుకుంటున్న వందల మంది రియల్ ఎస్టేట్ వారిని, అవినీతి అధికారులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. ఆర్ కృష్ణయ్య లాంటి మంచి బీసీ నేత కూడా బీజేపీకి సపోర్ట్ చేయడం బాధాకరమన్నారు. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ పాలకులు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలా చేశారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు కే ఏ పాల్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఆర్ఆర్ ట్యాక్స్ వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. ఆర్ఆర్ టాక్స్ కట్టని వారి బిల్డింగులు హైడ్రా పేరుతో 432 బిల్డింగులు కూల్చారని ఆరోపించారు. ఔటర్ రింగ్ రోడ్డు మాటల్లోనే గాని చేతల్లో లేదన్నారు.

60 శాతం ఉన్న బీసీలు ఆంధ్ర తెలంగాణలో ఒక్క బీసీ ముఖ్యమంత్రి కాలేదని అన్నారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటే అని ఆరోపించారు. బీజేపీ పార్టీ నామమాత్రం గానే ఉందన్నారు. అందుకే ఈ పార్టీలను గుడ్ బై చెప్పి బీసీ మద్దతు పార్టీగా ప్రజాశాంతి పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు. తెలంగాణను బంగారు తెలంగాణగా మారుస్తానని అన్నారు. మోహన్ బాబుతో మాట్లాడించి మీడియాతో క్షమాపణలు చెప్పించానని చెప్పారు. సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి గురు శిష్యులు.. ఎవరి పాలన బాగుందంటే ఎవరు మర్డర్ బాగా చేశారు.. అడిగినట్లుందని తీవ్ర విమర్శలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed