- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Natural Hair Colour: నో కెమికల్స్.. హోం మేడ్ హెయిర్ కలర్ తయారీ విధానం
దిశ, వెబ్‌డెస్క్: ప్రజెంట్ డేస్‌లో చాలా మంది హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారు. అంతేకాకుండా వయసుతో సంబంధం లేకుండా తెల్ల జుట్టు కూడా వస్తుంది. దీంతో ఏటైనా ఫంక్షన్లు, పెళ్లిళ్లకు హాజరైతే.. నలుగురిలో నిల్చునేందుకు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యే పరిస్థితులు నెలకొంటాయి. కాగా కొంతమంది మార్కెట్‌లో లభించే పలు హెయిర్ కలర్స్ వాడుతుంటారు. అప్పటి వరకు జుట్టు రంగు బ్లాక్‌గా అందంగా కనిపించినా.. కొన్ని డేస్ తర్వాత వెంట్రుకల ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. కాగా మీ హెయిర్ ఎలాంటి డ్యామేజ్‌కు గురి కాకుండా ఉండాలంటే ఇంట్లోనే నేచురల్‌గా ఇలా తయారు చేసుకోండి. హెయిర్ బ్లాక్‌గా అవ్వడంతో పాటు సిల్కీగా, మృదువుగా, స్ట్రాంగ్‌గా తయారవుతాయి. అంతేకాకుండా హెయిర్ ఫాల్ సమస్యకు కూడా చెక్ పెడుతుంది. సహజమైన హెయిర్ మాస్క్ తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం..
హోం మేడ్ హెయిర్ కలర్ తయారీ కోసం కావాల్సిన పదార్థాలు..
ఇండిగో పౌడర్ - ఒక టీ స్పూన్, పసుపు - టీ స్పూన్, కాఫీ పొడి- ఒక టీస్పూన్, పెరుగు- పావు కప్పు, రెండు టీ స్పూన్లు -మెంతులు(నైట్ నానబెట్టాలి), కలబంద గుజ్జు టీస్పూన్, కాఫీ పొడి- టీస్పూన్ తీసుకోవాలి.
తయారీ విధానం..
ఫస్ట్ కలబంద గుజ్జు, మెంతులు, పెరుగు మూడింటిని ఒక పేస్ట్‌లా రెడీ చేసుకుని పక్కన పెట్టాలి. తర్వాత ఒక కడాయిలో పసుపును వేయించి.. అదే కడాయిలో ఇండిగో పౌడర్ రంగు ఛేంజ్ అయ్యే వరకు వేయించాలి. పెరుగు, మెంతులు, కలబంద గుజ్జులో పసుపు, ఇండిగో పౌడర్ కలిపాలి. అంతే ఈ మిశ్రమాన్ని మీ హెయిర్‌కు రాసి.. 3 గంటల వరకు ఉంచండి. తర్వాత గోరు వెచ్చటి వాటర్‌తో కడగండి. మీ హెయిర్ సహజంగా నల్లగా మారడంతో పాటు ప్రకాశవంతంగా మెరిసిపోతుంది కూడా.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.