- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP News:ఇండియా బుక్ రికార్డ్స్ అవార్డు పొందిన చిన్నారి
దిశ,రాయచోటి: ఇండియా బుక్ రికార్డ్స్ లో చోటు సంపాదించి అవార్డు పొందిన అన్నమయ్య జిల్లా రాజంపేట ముకుందర్ గడ్డకు చెందిన వీఆర్వో షేక్ ముజీబ్, షేక్ మసుద బేగం దంపతుల కుమారుడు చి.షేక్ మహమ్మద్ ముష్బాక్ సిద్ధిని, చిన్నారి తల్లిదండ్రులను జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ప్రత్యేకంగా అభినందించారు. శనివారం రాయచోటి కలెక్టరేట్‌లో చి.షేక్ మహమ్మద్ ముష్బాక్ సిద్ధికి తల్లిదండ్రులు కలెక్టర్‌ను ఆయన చాంబర్లో కలిశారు. తమ కుమారుడు చిన్న వయసు నుంచే ఎంతో చలాకీగా ఉండేవాడని.. ప్రస్తుతం ఒకటిన్నర సంవత్సరాల వయసులో 27 రకాల పండ్లు, కూరగాయలు, జంతువులు, పక్షులు, వృత్తులను, వాహనాలను స్వాతంత్ర సమరయోధులు మనిషి శరీర భాగాలు బొమ్మలు, ఆకారాలు చర్యల పదాలు ఆంగ్ల అక్షరాల ఆల్ఫాబెట్స్ మనుషులు, జంతువులు పక్షుల శబ్దాలు చాలా స్పష్టంగా గుర్తించడంతో ఇండియా బుక్ రికార్డ్స్ వారు ఇటీవల బాలునికి అవార్డు జారీ చేసినట్లు కలెక్టర్ కు వివరించారు. చిన్నారి ప్రతిభ పాటవాలను మరింత ప్రోత్సహించాలని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అందుకునేలా బాగా చదివించాలని కలెక్టర్ పేర్కొన్నారు.