విధులు సక్రమంగా నిర్వహించాలి

by Sridhar Babu |
విధులు సక్రమంగా నిర్వహించాలి
X

దిశ,బెల్లంపల్లి : వైద్య సిబ్బంది విధులు సక్రమంగా నిర్వహించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ హరీష్ రాజ్ అన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఆయన పర్యటించారు. పట్టణంలోని ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో నెలకొన్న అపరిశుభ్రతపై మండిపడ్డారు. ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఆరోగ్యకేంద్రం నిర్వహణ తీరు ఏమాత్రం బాగోలేదన్నారు. గదుల్లో, పరిసరాల్లో చెత్త పేరుకు పోయి ఉండటాన్ని చూసి ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా విధులు సక్రమంగా నిర్వహించాలని హెచ్చరించారు. ఆయన వెంట వైద్యాధికారి డాక్టర్ సుచరిత, వైద్యులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed